ధర్పల్లి, ఆగస్టు 14 : మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన 12 ఏండ్ల చిన్నారికి డెంగ్యూ సోకినట్లు ఎంపీవో శ్రీధర్ తెలిపారు. చిన్నారికి డెంగ్యూ సోకిందన్న విషయం తెలియగానే శుక్రవారం ఆరోగ్య సిబ్బంది, అధికారులతో కలిసి కాలనీకి వెళ్లి బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు.
అనంతరం దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలతో పాటు కాలనీలో బ్లీచింగ్ పౌడర్‌ను పిచికారీ చేయించినట్లు ఎంపీవో తెలిపారు. ప్రతిఒక్కరూ దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని, నివాసిత పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ కార్యదర్శి రాకేశ్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.