MBBS Student Suicide | ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు కోల్పోయి.. ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య
MBBS Student Suicide | ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బెంగళూరు: ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (MBBS Student Suicide) కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. కాలబురగికి చెందిన 21 ఏళ్ల అనిష్కర్ చౌహాన్, బీదర్‌లోని మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. ఎంబీబీఎస్ చివరి ఏడాది విద్యార్థి అయిన అతడు ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడు. స్నేహితుల వద్ద సుమారు రూ.80,000 అప్పులు చేశాడు. ఆన్లైన్ గేట్లో ఈ డబ్బు పోగొట్టుకున్నాడు.
కాగా, ఈ ఆర్థిక నష్టం వల్ల అనిష్కర్ చౌహాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి తర్వాత హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మరోవైపు వైద్య విద్యార్థి మొబైల్ ఫోన్‌ను పోలీసులు చెక్ చేశారు. ఆన్లైన్ గేమ్ కోసం అతడు డబ్బులు చెల్లించినట్లుగా గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఏ ఆన్లైన్ గేమ్‌లో అనిష్కర్ డబ్బులు పోగొట్టుకున్నడో అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అతడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Custodial Deaths | ఈ ఏడాది తొలి 74 రోజుల్లో.. 170 కస్టడీ మరణాలు
Watch: ఆలయంలో రెచ్చిపోయిన పూజారులు.. భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

