Watch: ఆలయంలో రెచ్చిపోయిన పూజారులు.. భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు
Priests Drag, Punch Devotees | ఒక ఆలయంలోని పూజారులు రెచ్చిపోయారు. కొందరు భక్తులను ఈడ్చుకెళ్లారు. వారిని కొట్టడంతోపాటు పిడిగుద్దులు కురిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: ఒక ఆలయంలోని పూజారులు రెచ్చిపోయారు. కొందరు భక్తులను ఈడ్చుకెళ్లారు. వారిని కొట్టడంతోపాటు పిడిగుద్దులు కురిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Priests Drag, Punch Devotees) మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ సంఘటన జరిగింది. స్థానిక జ్యోతిబా ఆలయంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కాగా, సాంప్రదాయ ప్రదక్షిణ, హారతి సమయంలో కొందరు భక్తులు దురుసుగా ప్రవర్తించినట్లు ట్రస్ట్ ఆరోపించింది. హారతి కార్యక్రమానికి వారు అంతరాయం కలిగించినట్లు తెలిపింది. పదేపదే హెచ్చరించినప్పటికీ వారు వినిపించుకోలేదని, పూజారులపై గులాల్ విసిరారని ట్రస్ట్ ఆరోపించింది. ఈ గందరగోళంలో సాంప్రదాయ తలపాగాలు కిందపడిపోవడంతో పూజారులు ఆగ్రహించినట్లు వెల్లడించింది.
మరోవైపు పరిస్థితి అదుపు తప్పడంతో సుమారు 20 మంది పూజారులు నిందితులైన భక్తులను ఆలయ ప్రాంగణంలోకి ఈడ్చుకెళ్లి కొట్టారు. భయంతో పారిపోవడానికి వారు ప్రయత్నించగా తిరిగి లాక్కెళ్లి మళ్ళీ కొట్టారు. ఆ భక్తులపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆ ఆలయం వద్ద గందరగోళం చెలరేగింది. అక్కడకున్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. పరిస్థితిని అదుపుచేశారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆలయ పూజారుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆలయ ప్రవిత్రతను కాపాడేందుకు పూజారులు ప్రయత్నించినట్లు ఆలయ కమిటీ పేర్కొంది. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Kolhapur| Jyotiba Temple Incident | जोतिबा डोंगरावर आलेल्या भक्तांना पुजाऱ्यांकडून बेदम मारहाण; पाहा व्हिडिओ | NDTV मराठी#kolhapur #jyotiba_mandir #maharashtranews #ndtvmarathi #marathibatmya pic.twitter.com/o1QIm2DLKs
— NDTV Marathi (@NDTVMarathi) March 23, 2026
Also Read:
Kashmiris Donations To Iran | కశ్మీర్ ప్రజల విరాళాలు.. ఈ దయ మరువలేనిదన్న ఇరాన్
15 Deer Killed By Dogs | కుక్కల దాడిలో 15 జింకలు మృతి.. నలుగురు అటవీ శాఖ సిబ్బంది సస్పెండ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

