Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఆయన కెరీర్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చింది. ఈ విజయోత్సాహంలో ఉన్న సూర్య, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించగా, ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రీ-రిలీజ్ బజ్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో, ఈ ఏడాది సూర్యకు మరో విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.
ఇదిలా ఉండగా, తన 47వ సినిమాకు సంబంధించి సూర్య తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని 2026 ముగిసేలోపే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే సినిమా టైటిల్‌తో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటికే ‘కరుప్పు’తో భారీ విజయాన్ని అందుకున్న సూర్యకు, ‘విశ్వనాథ్ & సన్స్’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకుంటే, జితు మాధవన్ దర్శకత్వంలో వస్తున్న 47వ సినిమా విడుదలతో సూర్య వరుసగా మూడు విజయాలను ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.
కొంతకాలంగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూసిన సూర్యకు 2026 ఏడాది పూర్తిగా కలిసొచ్చినట్టే కనిపిస్తోంది. ఒకవేళ ‘విశ్వనాథ్ & సన్స్’, జితు మాధవన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటితే, ఈ ఏడాదిని హ్యాట్రిక్ విజయాలతో ముగించే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య అభిమానుల దృష్టి మొత్తం ఆగస్టు 14న విడుదల కానున్న విశ్వనాథ్ & సన్స్ నిలిచింది. ఆ సినిమా ఫలితంతో పాటు, జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.