Gold price | అమెరికాలో పెరిగిన ద్రవ్యోల్బణం.. తగ్గిన బంగారం ధరలు..!
Gold price | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold price) సోమవారం ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా (USA) లో ద్రవ్యోల్బణం (Inflation) అంచనాలకు మించి నమోదు కావడంతో ఈ వారం ఫెడరల్ రిజర్వ్ (Fed reserv) వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు బలపడ్డాయి.
Gold price : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold price) సోమవారం ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా (USA) లో ద్రవ్యోల్బణం (Inflation) అంచనాలకు మించి నమోదు కావడంతో ఈ వారం ఫెడరల్ రిజర్వ్ (Fed reserv) వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు బలపడ్డాయి. దీనికి తోడు ఎర్ర సముద్రం (Red Sea) ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ముడి చమురు ధరల (Crude Oil price) ను మండించడంతో పసిడి (Gold) పై మరింత ప్రతికూల ప్రభావం పడింది.
శుక్రవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. అమెరికాలో ఆగస్టు నెలకుగాను కీలక ద్రవ్యోల్బణం (ఆహారం, ఇంధన ధరలు మినహాయించి) 0.3 శాతం పెరిగింది. ఇది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడానికి దారితీస్తుందనే భయాలను మార్కెట్లో నింపింది. ట్రేడర్లు ఈ నెలలో వడ్డీ రేట్ల పెంపునకు 88 శాతం అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి కానుంది.
సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం వంటి రాబడి లేని ఆస్తులపై మదుపరులు ఆసక్తి చూపరు. ఈ అంచనాలతో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు దాదాపు 4,340 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ 0.2 శాతం నష్టపోయింది. వెండి ధర కూడా 0.8 శాతం తగ్గి ఔన్స్‌కు 64 డాలర్లకు చేరింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముడి చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.
భారత మార్కెట్లో వినాయక చవితి సందర్భంగా ఇవాళ ఉదయం సెషన్లో ఎంసీఎక్స్ ట్రేడింగ్ జరగలేదు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు మాత్రమే ట్రేడింగ్ కొనసాగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

