2 Indians Killed in Oman floods | ఒమన్‌లో ఆకస్మిక వరదలు.. కారు కొట్టుకుపోవడంతో ఇద్దరు భారతీయులు మృతి, ఒకరు గల్లంతు
2 Indians Killed in Oman floods | ఒమన్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణించిన నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మరో భారతీయ మహిళ గల్లంతైంది.
మస్కట్: ఒమన్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణించిన నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మరో భారతీయ మహిళ గల్లంతైంది. (2 Indians Killed in Oman floods) శనివారం ఈద్ సందర్భంగా ఒమన్ రాజధాని మస్కట్‌తో సహా పలు నగరాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీరు పలు ప్రాంతాలను ముంచెత్తింది.
కాగా, ఒమన్‌లోని అల్ బతినా గవర్నరేట్‌లో వరద ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణించిన వారిలో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. కేరళలోని త్రిథాలకు చెందిన యూసుఫ్, షమ్లాగా వారిని గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన మరో మహిళ రమ్లా గల్లంతైంది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ జోక్యం కోరుతూ లేఖ రాశారు. ఒమన్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో కేరళలోని త్రిథాలకు చెందిన యూసుఫ్, షమ్లా మరణించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. గల్లంతైన రమ్లా కోసం గాలింపు, సహాయక చర్యల్లో ఒమన్ అధికారులతో సమన్వయానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని సతీశన్ విజ్ఞప్తి చేశారు.
Also Read:
Iran says shot down F-15 jet | ‘ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చేశాం’.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్
Iranian Navy guided | భారత ఎల్పీజీ నౌకకు.. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నేవీ మార్గనిర్దేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Eid
- Flash floods
- Indians
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

