Iran Missile strikes Israel’s Dimona | ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలో ఇరాన్ క్షిపణి దాడులు.. వంద మందికిపైగా గాయాలు
Iran Missile strikes Israel's Dimona | ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా నగరంపై ఇరాన్ దాడి చేసింది. శనివారం సాయంత్రం ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఢిఫెన్స్ వ్యవస్థ విఫలమైంది. దీంతో భారీగా పేలుడు సంభవించింది.
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా నగరంపై ఇరాన్ దాడి చేసింది. శనివారం సాయంత్రం ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఢిఫెన్స్ వ్యవస్థ విఫలమైంది. (Iran Missile strikes Israel’s Dimona) దీంతో భారీగా పేలుడు సంభవించింది. డిమోనా, అరద్లపై ఇరాన్ జరిపిన రెండు క్షిపణుల దాడుల్లో 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, శనివారం ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
మరోవైపు ఇజ్రాయెల్‌లోని డిమోనాలో క్షిపణి దాడిని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఏఈఏ) ధృవీకరించింది. అయితే నెగెవ్ అణు పరిశోధనా కేంద్రానికి నష్టం వాటిల్లినట్లు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. అలాగే ఎలాంటి అసాధారణ రేడియేషన్ స్థాయిలను గుర్తించలేదని పేర్కొంది.
JUST IN: 🇮🇷🇮🇱 Another view of an Iranian ballistic missile striking Dimona, Israel. pic.twitter.com/vImQZxVZJF
— BRICS News (@BRICSinfo) March 21, 2026
JUST IN: 🇮🇷🇮🇱 Iranian ballistic missile strikes Dimona, Israel. pic.twitter.com/wZyzS2GGgO
— BRICS News (@BRICSinfo) March 21, 2026
Also Read:
West Asia War | ముదిరిన యుద్ధం.. అమెరికా వెనక్కి ఇజ్రాయెల్ ముందుకు!
Iranian Navy guided | భారత ఎల్పీజీ నౌకకు.. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నేవీ మార్గనిర్దేశం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

