ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్
పార్లమెంట్లో ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్)కు మద్దతు కూడగట్టేందుకు ఎంపీలతో బీజేపీ భారీగా బేరసారాలకు దిగుతున్నదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
- డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలకు గురి చేస్తున్నారు
- కేంద్రంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణ
- ‘రాజకీయ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్’ ఏర్పడిందని విమర్శలు
ముంబై: పార్లమెంట్లో ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్)కు మద్దతు కూడగట్టేందుకు ఎంపీలతో బీజేపీ భారీగా బేరసారాలకు దిగుతున్నదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఛత్రపతి సంభాజీనగర్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన రౌత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ ముంబైకి రావడాన్ని ప్రశ్నించారు. డబ్బు తరలింపునకు ముంబై మార్గంగా మారిందని ఆయన అన్నారు.
‘కేంద్ర హోంమంత్రికి ముంబైలో అసలు పని ఏమున్నది? ఎంపీలను ఆకర్షించే బాధ్యతను మహారాష్ట్ర, ముంబైలోని కొందరు కీలక నేతలకు అప్పగించారా?’ అని రౌత్ ప్రశ్నించారు. కొద్ది రోజుల కిందట ఒక ఎంపీ ధర రూ.100 కోట్లు ఉండగా, ఇప్పుడు అది రూ.150 కోట్లకు చేరిందని రౌత్ ఆరోపించారు. ప్రతిపక్షాల సంఖ్యా బలాన్ని తగ్గించేందుకు అధికార పార్టీ తన అధికారాన్ని వినియోగిస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీల ప్రకటనలో జాప్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని రౌత్ ప్రశ్నించారు. సమావేశాల నిర్వహణకు ఇంత ఆలస్యం ఎందుకవుతున్నదని అడిగారు.
ఎంపీలను తమవైపు తిప్పుకోవడానికి, ఆర్థిక లావాదేవీలకు వీలు కల్పించడానికి ప్రభుత్వం సమయం తీసుకుంటున్నదా అని ప్రశ్నించారు. ఎంపీల కొనుగోలు విక్రయాల ఆరోపణలను స్టాక్ మార్కెట్‌తో పోల్చారు. ‘నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో షేర్ల ధరలు ప్రదర్శించినట్టే, ఎంపీల కొనుగోలుకు దేశవ్యాప్త ధరలు ఇప్పుడు చెబుతున్నా’ అని అన్నారు. దేశంలో కొత్తగా ‘రాజకీయ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్’ ఏర్పడిందని రౌత్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

