Iranian Navy guided | భారత ఎల్పీజీ నౌకకు.. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నేవీ మార్గనిర్దేశం
Iranian Navy guided India's LPG vessel | అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో కీలక హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. అయితే భారత్‌కు చెందిన ఎల్పీజీ నౌకకు ఇరాన్ నేవీ సహాయం చేసింది. హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు మార్గనిర్దేశం చేసింది.
న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో కీలక హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. అయితే భారత్‌కు చెందిన ఎల్పీజీ నౌకకు ఇరాన్ నేవీ సహాయం చేసింది. హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు మార్గనిర్దేశం చేసింది. (Iranian Navy guided India’s LPG vessel) గతవారం భారత్‌కు చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్‌లోని ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని తెలిపినట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.
కాగా, గతవారం రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు కీలకమైన హోర్ముజ్ జలసంధిని దాటి దేశానికి చేరుకున్నాయి. దీని కోసం ఇరాన్ అనుమతి పొందాయి. ఇరాన్‌తో భారత్ సంప్రదింపుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలోని నిర్దేశిత మార్గంలో ఈ రెండు నౌకలు ప్రయాణించాయి. ఈ సందర్భంగా ఇరాన్ నావికాదళం వాటికి మార్గనిర్దేశం చేసింది.
మరోవైపు ఇరాన్ నేవీతో రేడియో ద్వారా సంప్రదింపులు జరిపినట్లు ఒక ఎల్పీజీ ట్యాంకర్ అధికారి చెప్పారని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. నౌక జెండా, మూలం, గమ్యస్థానం, సిబ్బంది జాతీయతతో సహా వివరణాత్మక సమాచారాన్ని ఇరాన్ నేవీ సేకరించినట్లు పేర్కొంది.
అయితే భారత ట్యాంకర్లలోని సిబ్బంది అంతా భారతీయులేనని నిర్ధారించుకున్న తర్వాత నిర్దేశిత మార్గంలో ఆ నౌక ప్రయాణించేందుకు ఇరాన్ నేవీ అనుమతించినట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. కీలక హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ అమలు చేస్తున్న నియంత్రిత ప్రయాణ వ్యవస్థను ఇది సూచిస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొంది.
Also Read:
Ramadoss, Sasikala join hands | తమిళనాడులో కొత్త రాజకీయ కూటమి.. చేతులు కలిపిన రామదాస్, శశికళ
Karnataka Officer Dies by Suicide | సీనియర్ వేధింపులు తాళలేక.. అధికారి ఆత్మహత్య
Watch: గ్యాస్ కొరత నేపథ్యంలో.. గ్యాస్ సిలిండర్లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bloomberg
- guided
- India
- Iranian Navy
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

