Watch: గ్యాస్ కొరత నేపథ్యంలో.. గ్యాస్ సిలిండర్లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు
Gas Cylinders Stolen | ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌తో పాటు చోరీలు కూడా పెరుగుతున్నాయి. హెల్మెట్లు ధరించి స్కూటీ వచ్చిన ఇద్దరు వ్యక్తులు అపార్ట్మెంట్లోని ఇళ్ల నుంచి గ్యాస్ సిలిండర్లు దొంగిలించారు.
బెంగళూరు: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌తో పాటు చోరీలు కూడా పెరుగుతున్నాయి. హెల్మెట్లు ధరించి స్కూటీ వచ్చిన ఇద్దరు వ్యక్తులు అపార్ట్మెంట్లోని ఇళ్ల నుంచి గ్యాస్ సిలిండర్లు దొంగిలించారు. (Gas Cylinders Stolen) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. గురువారం హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు స్కూటీపై బేగూర్‌లోని అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. కొందరు నివాసితులు ఉగాది పండగ సందడిలో ఉన్నారు.
కాగా, ఒక వ్యక్తి గేటు తీసుకుని ఆ బిల్డింగ్‌లోకి వెళ్లాడు. ఒక ఇంటి నుంచి రెండు గ్యాస్ సిలిండర్లు చోరీ చేశాడు. మెల్లగా గేటు వద్దకు వాటిని తీసుకువచ్చాడు. ఆ తర్వాత స్కూటీని లోపలకు నడిపాడు. రెండు గ్యాస్ సిలిండర్లు స్కూటీపై ఉంచి బయటకు వచ్చాడు. బయట వేచి ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు గ్యాస్ సిలిండర్లు మాయం కావడంతో ఆ కుటుంబం ఆందోళన చెందింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సీసీటీవీలో రికార్డైన గ్యాస్ సిలిండర్ల చోరీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bengaluru, Karnataka – In a shocking incident amid the ongoing nationwide LPG shortage triggered by geopolitical tensions in West Asia, two domestic cooking gas cylinders were stolen from a residential apartment in Bengaluru’s southern outskirts. CCTV Footage Goes Viral pic.twitter.com/sqS6wJezN0
— NextMinute News (@nextminutenews7) March 21, 2026
Also Read:
Punjab Minister resigned | అధికారి ఆత్మహత్య.. పంజాబ్ మంత్రి రాజీనామా
Watch: 18 మంది నిందితులను పబ్లిక్‌గా చితకబాదిన పోలీసులు.. ఎందుకంటే?
Watch: శవాల మాదిరిగా నీటిలో తేలిన జంట.. వింత ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

