PhonePe CEO | ‘యూపీఐ చెల్లింపులపై చార్జీలు’.. ఫోన్‌పే సీఈవో కీలక ప్రకటన..!
PhonePe CEO | యూపీఐ చెల్లింపుల (UPI payments) పై ఛార్జీలు పడతాయంటూ జరుగుతున్న చర్చకు ఫోన్‌పే సీఈవో (Phone Pay CEO) సమీర్ నిగమ్ (Sameer Nigam) తెరదించారు. సాధారణ వినియోగదారులు యూపీఐ ద్వారా డబ్బు పంపేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ‘భారతీయ వినియోగదారులందరికీ యూపీఐ ఉచితంగానే ఉంటుంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
PhonePe CEO : యూపీఐ చెల్లింపుల (UPI payments) పై ఛార్జీలు పడతాయంటూ జరుగుతున్న చర్చకు ఫోన్‌పే సీఈవో (Phone Pay CEO) సమీర్ నిగమ్ (Sameer Nigam) తెరదించారు. సాధారణ వినియోగదారులు యూపీఐ ద్వారా డబ్బు పంపేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ‘భారతీయ వినియోగదారులందరికీ యూపీఐ ఉచితంగానే ఉంటుంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
లోక్‌సభలో కొత్త పన్ను సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అంశంపై చర్చ మొదలైంది. దాంతో యూపీఐ వాడితే సామాన్యుల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎండీఆర్ ఉంటే అది వ్యాపార సంస్థల పరిధిలోనే ఉంటుందని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది.
చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరించేందుకు ఎలాంటి ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులు పేమెంట్ సేవల సంస్థలకు చెల్లించే రుసుమునే ఎండీఆర్ అంటారు. కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000 కు మించిన కొన్ని వ్యాపార సంబంధిత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై 0.25 శాతం నుంచి 0.4 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉంది.
వ్యక్తిగతంగా ఒకరి నుంచి మరొకరికి చేసే యూపీఐ చెల్లింపులకు ఇది వర్తించదు. కొత్త బిల్లు యూపీఐ వినియోగదారులపై నేరుగా ఛార్జీలు విధించడం లేదని పీసీఐ స్పష్టంచేసింది. దాదాపు పదేళ్లుగా బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, ఎన్పీసీఐ, ఆర్బీఐ కలిసి యూపీఐ వ్యవస్థ నిర్వహణ, సైబర్ భద్రత, మోసాల నివారణ వంటి ఖర్చులను భరిస్తున్నాయి. ఇకపై ఈ వ్యవస్థకు స్థిరమైన ఆర్థిక నమూనాపై చర్చ జరుగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

