ఏబీవీపీ ఒత్తిడితో ముస్లిం ప్రొఫెసర్ రాజీనామా!
విద్యార్థుల హాజరుకు సంబంధించిన వివాదం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఒత్తిడితో కోల్కతాలోని సురేంద్రనాథ్ కళాశాలకు చెందిన ఒక ముస్లిం ప్రొఫెసర్ బలవంతపు రాజీనామాకు దారి తీసింది.
- హాజరుపై కఠినంగా ఉన్నందుకు ‘శిక్ష’
కోల్కతా : విద్యార్థుల హాజరుకు సంబంధించిన వివాదం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఒత్తిడితో కోల్కతాలోని సురేంద్రనాథ్ కళాశాలకు చెందిన ఒక ముస్లిం ప్రొఫెసర్ బలవంతపు రాజీనామాకు దారి తీసింది. ఈ నెల 11న ఏబీవీపీ సభ్యులు కొందరు వైస్ ప్రిన్సిపాల్ మొహమ్మదీ తరన్నుమ్ ఆఫీసును రోజంతా ముట్టడించి ఆమె రాజీనామా లేఖను తామే తయారుచేసి దానిపై ఆమెతో బలవంతంగా సంతకం పెట్టించారు.
పోలీసులు ఆమెను సురక్షితంగా బయటకు పంపిన తర్వాత ఏబీవీపీ సభ్యులు ఆమె కార్యాలయాన్ని శుద్ధి చేస్తున్నట్టుగా అగర్ బత్తీలు వెలిగించి, గంగాజలాన్ని చల్లారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా తరన్నుమ్ వ్యవహరించారు. సెమిస్టర్ పరీక్షల కోసం విద్యార్థులకు 65 శాతం హాజరు తప్పనిసరి. ఈ నెల 28న జరగనున్న పరీక్షలకు హాజరు నిబంధన కచ్చితంగా వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఏబీవీపీ ఆమె రాజీనామాకు ఒత్తిడి తెచ్చినట్టు భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

