హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : వినూత్న ఆలోచనలతో సరికొత్త వ్యాపార రంగాల్లోకి యువత అడుగుపెట్టాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించే ఉత్పత్తులతో సమాజానికి మేలు చేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలు భానురెడ్డి, సౌజన్య ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న పౌష్టికాహార అంకుర సంస్థ (స్టార్టప్) ‘క్విక్ వైబ్ హై ప్రొటీన్ ఓట్ మీల్’ అధికారిక లోగోను ఆయన మంగళవారం ఆవిషరించారు. ఆధునిక ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అధిక ప్రొటీన్లతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు ముందుకొచ్చిన వ్యవస్థాపకులను ప్రత్యేకంగా అభినందించి, వారి సంస్థ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో యువత సరికొత్త ఆలోచనలతో స్వయం ఉపాధి సాధించడంతో పాటు ఇతరులకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించే స్టార్టప్ లను ప్రారంభించడం ఎంతో అభినందనీయమని కేటీఆర్‌తో పాటు నాయకులు పేరొన్నారు. ప్రజారోగ్యానికి మేలుచేసే ఇలాంటి పోషకాహార ఉత్పత్తులకు మారెట్లో మంచి ఆదరణ లభించాలని వ్యవస్థాపక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ లోగో ఆవిషరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పడాల సతీష్, యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.