పసికందులది ప్రభుత్వ హత్యే
ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) దవాఖానలో సజీవ దహనమైన పసికందులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. నియోనెటాలజీ వార్డులో ఏసీ కంప్రెషర్ పేలి ముగ్గురు పసికందులు సజీవ దహనమైన ఘటనపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
- దవాఖానల నిర్వహణ అస్తవ్యస్తం రాష్ట్రంలో ఆరోగ్యమంత్రి ఉన్నారా?
- ఆదిలాబాద్ రిమ్స్ దుర్ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారించాలి
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) దవాఖానలో సజీవ దహనమైన పసికందులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. నియోనెటాలజీ వార్డులో ఏసీ కంప్రెషర్ పేలి ముగ్గురు పసికందులు సజీవ దహనమైన ఘటనపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎల్-కాంగో మహమ్మారి బీభత్సానికి పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులైన మిగతా చిన్నారులు క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇంత ఘోరం జరిగిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి మొకుబడిగా సమీక్షలు నిర్వహించడం చేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నదని విమర్శించారు. అసలు రాష్ట్రానికి ఆరోగ్యశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ దవాఖానలను కంటికి రెప్పలా కాపాడాల్సిన సీఎం, మంత్రులు ఆ బాధ్యతను గాలికొదిలి ప్రతిపక్షాలపై కక్షసాధింపు రాజకీయాలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. దుర్ఘటన జరిగిన మరునాడు ఉదయమే సీఎం, ఆరోగ్యశాఖ బాధ్యులు ఆదిలాబాద్ చేరుకొని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాల్సింది పోయి, మాజీ మంత్రి హరీశ్రావు కుటుంబ సభ్యుల ఆస్తులపై దాడులను పర్యవేక్షిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని నిప్పులు చెరిగారు.
సీఎం కుటుంబ సభ్యులు ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ చైన్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయని, అందుకే ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖాన అయిన రిమ్స్ నుంచి బాధితులను ప్రైవేట్ దవాఖానలకు తరలించడమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

