ఎల్పీజీ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి
వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధన తీసుకొచ్చింది. సబ్సిడీ ధరకు ఎల్పీజీ సిలిండర్లు పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ పూర్తి చేయాల్సిందేనని తాజాగా పేర్కొంది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.
- గతంలో అవసరం లేదని ఇప్పుడు మాటమార్చిన కేంద్రం
న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధన తీసుకొచ్చింది. సబ్సిడీ ధరకు ఎల్పీజీ సిలిండర్లు పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ పూర్తి చేయాల్సిందేనని తాజాగా పేర్కొంది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. 2024లో పెట్రోలియం, సహజవాయువు శాఖ(ఎంఓపీఎన్జీ) జారీ చేసిన ప్రకటనల్లో ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయని వినియోగదారులకు ఎలాంటి సేవలు లేదా ప్రయోజనాలు నిలిపివేయలేదని పేర్కొంది.
వినియోగదారులు బయో మెట్రిక్ అథెంటిఫికేషన్ చేసుకోవాలని మాత్రమే సూచించింది. అప్పట్లో దీనిని తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొనలేదు. తాజా సమాచారం ప్రకారం సబ్సిడీ ధరకు ఎల్పీజీ రీఫిల్ పొందాలంటే, బయోమెట్రిక్ ఆధార్ అథెంటిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ప్రక్రియ ఒక్కసారి పూర్తి చేస్తే సరిపోతుందని తెలిపింది. దీనికి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

