Teachers Protest | ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల నిరసన ర్యాలీ
Teachers Protest | ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలు జరిగాయని వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే దీనికి వ్యతిరేకంగా మెగా డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు శనివారం ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
అమరావతి : ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలు జరిగాయని వైసీపీ ( YCP ) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే, వైసీపీకి వ్యతిరేకంగా మెగా డీఎస్సీ ( Mega DSC ) 2025 ఉపాధ్యాయులు శనివారం ర్యాలీ ( Teachers Protest) నిర్వహించి నిరసన తెలిపారు. కడప, అనంతపురం జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయులు కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జడ్పీ కార్యాలయం వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వం వాస్తవాలు వివరించినా వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఎంతో కష్టపడి 2025 మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధిస్తే వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తు ఆందోళనలు చేపట్టడం విచారకరమని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకంతో 16 వేలకు పైగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది మా కష్టం.. మా ప్రతిభ అవమానిస్తే ఊరుకోం అంటూ బ్యానర్లు,ప్లకార్డులతో నిరసన తెలిపారు. హారిజాంటల్ రిజర్వేషన్‌ను అర్థం చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

