Mamitha Baiju | వరుస విజయాలతో బాక్సాఫీస్ క్వీన్‌గా మమిత బైజు.. ఏడాదిలోపే రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సంచలనం!
Mamitha Baiju | మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండియా అంతటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో మమిత బైజు (Mamitha Baiju) ఒకరు.
Mamitha Baiju | మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండియా అంతటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో మమిత బైజు (Mamitha Baiju) ఒకరు. గడిచిన ఏడాది కాలంలో ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను నమోదు చేయడమే కాకుండా, ఏకంగా రూ. 1000 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను దాటడం విశేషం. కేవలం సహజమైన నటనతోనే కాకుండా తనదైన ప్రత్యేక శైలితో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరోయిన్, ప్రస్తుతం సౌత్ సినిమా పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ నటిగా దూసుకుపోతున్నారు.
కేరళలోని కొట్టాయంకు చెందిన మమిత బైజు 2016లో విడుదలైన ‘పావడ’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించినప్పటికీ, ‘ప్రేమలు’ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ చిత్రంలోని ‘రీను’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కూడా ఆమె బలమైన స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇక గత ఏడాది కాలంలో మమిత బైజు నటించిన సినిమాల బాక్సాఫీస్ సునామీ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. విజయ్ సరసన నటించిన సినిమా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేయగా, ప్రదీప్ రంగనాథన్‌తో చేసిన చిత్రం రూ. 100 కోట్లు రాబట్టింది. అలాగే సూర్య నటిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్రం రూ. 260 కోట్లు, ధనుష్‌తో కలిసి నటించిన ‘కర’ సినిమా రూ. 55 కోట్లు సాధించాయి. మరోవైపు థియేటర్లలో దూసుకుపోతున్న ‘బెత్లహోమ్ కుటుంబ యూనిట్’ ఇప్పటికే రూ. 310 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇలా కేవలం 12 నెలల వ్యవధిలోనే ఆమె నటించిన చిత్రాలు సుమారు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి.
ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి, ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించడంలో మమిత బైజు దిట్ట. ఏ పాత్రను ఎంచుకున్నా దానికి పూర్తి న్యాయం చేయడం ఆమె ప్రత్యేకత. అందుకే రోజురోజుకూ ఆమెకు ఫ్యాన్ ఫాలోవర్స్ భారీగా పెరిగిపోతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మమిత బైజు రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

