బన్నీ ‘రాకా’లో గోవిందా?
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా స్టార్ల కలయికతో ఓ పాలపుంతని తలపిస్తున్నది. మాఫియా, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథాంశంతో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా స్టార్ల కలయికతో ఓ పాలపుంతని తలపిస్తున్నది. మాఫియా, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథాంశంతో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా ఈసినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
దక్షిణాది చిత్రాల్లో గోవిందా నటించడం ఇదే ప్రధమం. గోవిందా నటించనున్న పాత్ర నిడివి తక్కువే అయినా.. అది ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని వినికిడి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి. డిసెంబర్ రెండోవారంలోపు ఈ సినిమా చిత్రీకరణను ముగించాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నదట. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

