Thatipaka Krishnaswamy | ‘ఇరుముడి’ చిత్రానికి మార్గదర్శిగా తాటిపాక కృష్ణస్వామి.. గురుస్వామిపై దర్శకుడు శివ నిర్వాణ ప్రత్యేక ప్రశంసలు!
Thatipaka Krishnaswamy | మాస్ మాహరాజ రవితేజ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో అయ్యప్ప స్వామి భక్తి, పూజల నేపథ్యంతో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ఇరుముడి' (Irumudi).
Thatipaka Krishnaswamy | మాస్ మాహరాజ రవితేజ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో అయ్యప్ప స్వామి భక్తి, పూజల నేపథ్యంతో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా.. సినిమా సక్సెస్ ఈవెంట్లో ఈ సినిమా ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన విశేషాన్ని దర్శకుడు పంచుకున్నారు. ఈ చిత్రంలో అయ్యప్ప స్వామి మాలధారణ, పడి పూజలు మరియు ఇతర సాంప్రదాయ విషయాలను అత్యంత నియమనిష్టలతో, సహజసిద్ధంగా చూపించడానికి తాటిపాక కృష్ణస్వామి గారు చిత్ర బృందానికి ఎంతో సహాయపడ్డారని శివ నిర్వాణ తెలిపారు.
ఆయన గురించి దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. “మా సినిమా కథా నేపథ్యం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష అనుభవం ఉన్న ఒక గొప్ప గురుస్వామి మార్గదర్శకత్వం మాకు అవసరమైంది. ఆ సమయంలోనే మాకు తాటిపాక కృష్ణస్వామి గారు దొరికారు. ఆంధ్రప్రదేశ్‌లో అయ్యప్ప భక్తులలో ఆయన గురించి తెలియని వారు ఉండరు. ఈ సినిమా కోసం పడి పూజలు ఎలా నిర్వహించాలి, మాలధారణ సమయంలో పాటించాల్సిన నియమాలు, పద్ధతులు ఏమిటనే విషయాల్లో ఆయన దగ్గరుండి సమస్త బాధ్యతలను చూసుకున్నారు. చిత్ర బృందానికి అన్ని తానే అయి నడిపించిన కృష్ణస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని కొనియాడారు. కృష్ణస్వామి గారి మార్గదర్శకత్వంలో తెరకెక్కిన సన్నివేశాలు అయ్యప్ప భక్తులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చిత్రబృందం ఈ సందర్భంగా వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామంలో జన్మించిన కృష్ణస్వామి (ఆంధ్ర జేసుదాస్) అయ్యప్ప భక్తులందరికీ సుపరిచితులు. పదకవితా పితామహుడు అన్నమాచార్యులవారికి తాను జన్మించిన గ్రామమైన తాళ్ళపాక ఇంటి పేరయినట్టుగానే, ప్రస్తుతం తాను పుట్టిన ఊరు పేరుతోనే ఆయన ‘తాటిపాక కృష్ణస్వామి’గా పిలవబడుతున్నారు. ఈయన పేరు వింటేనే ఎంతోమంది అయ్యప్ప స్వామిల మదిలో ఆయన పాడే పాటలు గుర్తుకు వస్తాయి. ఆయన భజన ఒక్కసారి వింటే చాలు మనసులో ఎక్కడలేని భక్తి భావాలు కలుగుతుంటాయి. తెలుగు, తమిళం, మలయాళం – ఇలా మూడు భాషల్లోనూ అయ్యప్ప స్వామి పాటలను అద్భుతంగా పాడగల నైపుణ్యం ఆయన సొంతం. ఇప్పటివరకు ఏకంగా 41 సార్లు అయ్యప్ప స్వామి మాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ధరించిన అనుభవం కలిగిన గొప్ప గురుస్వామి ఆయనది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | దేశం పేదరికాన్ని జయించింది.. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ..!
Ram Pothineni | మెన్స్ డే స్పెషల్.. ‘RAPO23’ ప్రీ-లుక్ వైరల్!
‘పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలి’
KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
TVK Workers Open Channel Gates | రీల్ కోసం కాలువ గేట్లు తెరిచిన టీవీకే కార్యకర్తలు.. మండిపడిన ప్రతిపక్షాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

