TVK Workers Open Channel Gates | రీల్ కోసం కాలువ గేట్లు తెరిచిన టీవీకే కార్యకర్తలు.. మండిపడిన ప్రతిపక్షాలు
TVK Workers Open Channel Gates | తమిళనాడులోని అధికార టీవీకే పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం కోసం ప్రయత్నించారు. ఒక కాలువ గేట్లను వారు తెరిచారు. అయితే డ్యామ్ గేట్లను తాము తెరిచినట్లు వీడియోలో పేర్కొన్నారు.
చెన్నై: తమిళనాడులోని అధికార టీవీకే పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం కోసం ప్రయత్నించారు. ఒక కాలువ గేట్లను వారు తెరిచారు. అయితే డ్యామ్ గేట్లను తాము తెరిచినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఆ రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. (TVK Workers Open Channel Gates) ఈ నేపథ్యంలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తేని జిల్లాకు చెందిన టీవీకే కార్యకర్తలు రీల్ కోసం ప్రయత్నించారు. ఒక నీటి కాలువ గేట్లను వారు తెరిచారు. కాలువ నుంచి నీటి ప్రవాహాన్ని మళ్లించారు. అయితే సోతుపరై డ్యామ్ గేట్లను తాము తెరిచినట్లుగా ఆ రీల్లో వారు పేర్కొన్నారు. ఇది వైరల్ అయ్యింది. దీంతో టీవీకే కార్యకర్తలు డ్యామ్ గేట్లు తెరిచినట్లు తెలుసుకుని ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందారు.
కాగా, నీటి వనరుల శాఖ అధికారులు దీనిపై స్పందించారు. సోతుపరై డ్యామ్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలువ గేట్లను మాత్రమే టీవీకే కార్యకర్తలు తెరిచినట్లు తెలిపారు. డ్యామ్ గేట్లు తెరువలేదని, దీనిపై ఆందోళన చెందవద్దని కోరారు. టీవీకే కార్యకర్తల చట్టవిరుద్ధ చర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు వివరించారు.
మరోవైపు ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే ఈ సంఘటనపై మండిపడ్డాయి. రీల్ కోసం నీటి షట్టర్లను తెరిచిన టీవీకే కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డీఎంకే డిమాండ్ చేసింది. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి కూడా అధికార పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘టీవీకే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రుల చర్యలు సిగ్గుచేటు. వారు సృష్టిస్తున్న గందరగోళం హద్దులు దాటింది. గత ఆరు నెలలుగా తమిళనాడు ప్రజలు టీవీకే విన్యాసాలు, విదూషక ప్రవర్తనను చూసి నమ్మలేక నవ్వుకుంటున్నారు’ అని ఎక్స్ పోస్ట్‌లో ఆయన విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gates
- Open
- panic
- political storm
RELATED ARTICLES
తాజా వార్తలు
TVK Workers Open Channel Gates | రీల్ కోసం కాలువ గేట్లు తెరిచిన టీవీకే కార్యకర్తలు.. మండిపడిన ప్రతిపక్షాలు
Samantha Ruth Prabhu | ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’.. వైరలవుతున్న సమంత సంప్రదాయ వేడుక
ACB Raid | అదనంగా గంట హోటల్ నిర్వహణకు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్
Sweets | స్వీట్లను అధికంగా తినడాన్ని తగ్గించలేకపోతున్నారా.. ఇలా చేస్తే ఆ అలవాటును మానవచ్చు..
Harish Rao | కాపాడిన భూమిని మళ్లీ అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్.. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

