PM Modi | దేశం పేదరికాన్ని జయించింది.. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ..!
PM Modi | భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. అంతే వేగంతో పేదరికాన్ని కూడా జయించిందని చెప్పారు. ఫిక్కీ (FICCI) వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
PM Modi : భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. అంతే వేగంతో పేదరికాన్ని కూడా జయించిందని చెప్పారు. ఫిక్కీ (FICCI) వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం మరింత అభివృద్ధి చెందడానికి అవసరమైన సంస్కరణలను నిస్సందేహంగా తెలియజెప్పాలని కార్పొరేట్ సంస్థలను కోరారు. గత ప్రభుత్వం పేదరిక నిర్మూలన (Poverty Eradication) లో విఫలమైందని ఆయన విమర్శించారు.
భారతదేశం ఒకప్పుడు బలహీనమైన ఐదు దేశాల సరసన ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. గత పన్నెండేళ్లుగా దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. భారతదేశ పురోగతికి ప్రపంచం సాక్షిగా నిలుస్తున్నదని అన్నారు. పాత ప్రభుత్వాల విధానాలు భారతదేశ వృద్ధిని అణచివేశాయని ప్రధాని ఆరోపించారు. కాలం చెల్లిన విధానాలు దేశాభివృద్ధిని కుంటుపరిచాయని అన్నారు. గత విధానపరమైన వైఫల్యాలు దేశం వృద్ధిని నిరోధించాయని చెప్పారు.
కార్పొరేట్ సంస్థలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. గడిచిన 13 ఏళ్లలో భారత్‌లో 50 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని చెప్పారు. ఈ విషయం తాను చెబుతున్నది కాదని, ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొనదని ఆయన తెలిపారు. వ్యాపారులను ప్రోత్సాహించేందుకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామన్నారు. అదేవిధంగా వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారికి పన్ను మినహాయింపు కల్పించామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ficci
- Narendra Modi
- Pm Modi
- poverty
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | దేశం పేదరికాన్ని జయించింది.. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ..!
Ram Pothineni | మెన్స్ డే స్పెషల్.. ‘RAPO23’ ప్రీ-లుక్ వైరల్!
‘పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలి’
KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
TVK Workers Open Channel Gates | రీల్ కోసం కాలువ గేట్లు తెరిచిన టీవీకే కార్యకర్తలు.. మండిపడిన ప్రతిపక్షాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

