KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
KTR | భూపాలపల్లి ఒకప్పుడు చిన్న పల్లెగా, గ్రామపంచాయతీగాఉండేది.. దాన్ని మున్సిపాలిటీ చేసుకొని పెద్దలు జయశంకర్ సార్ పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
KTR | భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సారథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీలో చేరుతున్న మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అందరికీ స్వాగతం పలుకుతూ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.. నవంబర్ 19.. ఇంకో 10 రోజులు పోతే కాంగ్రెస్ సర్కార్ వచ్చి సరిగ్గా మూడేండ్లు నిండుతది.. మరి పరిస్థితి ఎట్లా ఉంది.. గ్రామాల్లో ఏమనుకుంటున్నరు.. నా కంటే బాగా మీకే బాగా తెలుసు..నేను తిరుగుతున్నా.. జనం స్పందన చూస్తున్నా.. తప్పకుండా ఒక్కటైతే క్లియర్‌గా కనిపిస్తున్నదన్నారు..
కేసీఆర్ 2 సంవత్సరాల కింద ఒక మాట చెప్పారు.. మా అందరినీ ఒక రోజు కూర్చో బెట్టి మీరేం బాధపడకండి.. ఒక్క రెండేళ్లు పోతే ఈ కాంగ్రేసోళ్లు ఎంత పనులు చేస్తరో మీరే చూడుర్రి.. వాళ్లది వాళ్లే కక్కొచ్చేటట్టు చేసుకుంటరు.. అసలు వీళ్ల ప్రవర్తన, దోపిడీ కానీ చెప్పరానంత వికారం ఉంటది.. ప్రజలు బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ మీ దిక్కు టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు.. ఎందుకంటే పదేళ్ల కేసీఆర్ పరిపాలన అనుభవాలు, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ మీ కళ్ల ముందుంది.. భూపాలపల్లి ఒకప్పుడు చిన్న పల్లెగా, గ్రామపంచాయతీగాఉండేది.. దాన్ని మున్సిపాలిటీ చేసుకొని పెద్దలు జయశంకర్ సార్ పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు.
మీరంతా ఎవరైనా భూపాలపల్లి జిల్లా అయితదని కలలో కూడా అనుకున్నరా..? జిల్లా కేంద్రం చేసి వరంగల్ పోయే బాధ తప్పించి.. కలెక్టర్‌ను కలవాలన్నా, జిల్లా అధికారులను, ఎస్పీని కలవాలన్నా.. మీ భూపాలపల్లిలోనే ఒక అలీషాన్ కలెక్టరేట్ కట్టి, ఒక ఎస్పీ బంగ్లా కట్టి.. ఎలాంటి సామాన్యుడు పోయినా అధికారులంతా కలిసేటట్టు సౌకర్యాలు ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
LIVE: భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు.
📍 తెలంగాణ భవన్ https://t.co/kvbq6MvlJ6
— BRS Party (@BRSparty) November 19, 2026
Read Also :
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
TVK Workers Open Channel Gates | రీల్ కోసం కాలువ గేట్లు తెరిచిన టీవీకే కార్యకర్తలు.. మండిపడిన ప్రతిపక్షాలు
Samantha Ruth Prabhu | ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’.. వైరలవుతున్న సమంత సంప్రదాయ వేడుక
ACB Raid | అదనంగా గంట హోటల్ నిర్వహణకు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్
Sweets | స్వీట్లను అధికంగా తినడాన్ని తగ్గించలేకపోతున్నారా.. ఇలా చేస్తే ఆ అలవాటును మానవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

