Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Bandla Ganesh | చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు ఒంగోలు న్యాయస్థానం ఏడాది జైలుశిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు ఒంగోలు న్యాయస్థానం ఏడాది జైలుశిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. బుధవారం వెలువడిన ఈ తీర్పులో జరిమానా మొత్తంతో పాటు ఫిర్యాదుదారుకు అయిన న్యాయ ఖర్చులను కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే, 2018లో ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు ప్రాంతానికి చెందిన జానకిరామయ్య వద్ద బండ్ల గణేశ్ రూ. 95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే జానకిరామయ్య మరణించిన తర్వాత, ఆ అప్పు తీర్చే నిమిత్తం ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు (జెట్టి వెంకటేశ్వరరావు) పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ ద్వారా రూ. 95 లక్షల చెక్ అందజేశారు. ఆ చెక్ బ్యాంకులో నగదు లేక బౌన్స్ కావడంతో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం నెల రోజుల గడువు ఇచ్చింది. మరోవైపు ఈ తీర్పుపై బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, రాజ్యాంగం కల్పించిన అవకాశాల మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
Siddipeta | పోలీసుల దిగ్బంధనంలో సిద్దిపేట.. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
Jasprit Bumrah | టెస్టుల్లో బుమ్రా అరుదైన రికార్డు.. అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో చోటు..!
Ramayana | రూ. 1,500 కోట్ల క్లబ్లో ‘రామాయణం’.. 14 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

