Ram Pothineni | మెన్స్ డే స్పెషల్.. ‘RAPO23’ ప్రీ-లుక్ వైరల్!
Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లోనే ఒక పెద్ద సాహసానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు హీరోగా అలరించిన ఆయన, ఇప్పుడు తొలిసారిగా కథ రాసి, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న 'RAPO23' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లోనే ఒక పెద్ద సాహసానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు హీరోగా అలరించిన ఆయన, ఇప్పుడు తొలిసారిగా కథ రాసి, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ‘RAPO23’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా, నియో-నోయిర్ శైలిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే మంచి ఆసక్తి నెలకొంది.
నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (ఇంటర్నేషనల్ మెన్స్ డే) సందర్భంగా రామ్ పోతినేని ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. “ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్” అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్లో రామ్ తనదైన శైలిలో, కొత్త లుక్‌తో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. తన దారిని తానే ఎంచుకుంటూ, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే స్వతంత్ర వ్యక్తిగా ఈ పాత్రను ఆయన పరిచయం చేశారు. ఈ పోస్టర్ ద్వారా అందరికీ మెన్స్ డే విషెస్ చెప్పిన చిత్రబృందం, త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమా టైటిల్ ఏంటి, టీజర్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తుండగా, ఎస్. తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. దర్శకుడిగా, నటుడిగా రామ్ పోతినేని ఈ సినిమాతో ఎలాంటి కొత్త అనుభూతిని పంచుతారో చూడాలి.
LONE WOLF (noun)
A fiercely independent man who chooses his own path and faces the world alone.
Here’s Saluting you all on International Men’s Day. 🐺🖤🧸
#TheLoneWolf #RAPO23
— RAm POthineni (@ramsayz) November 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Pothineni | మెన్స్ డే స్పెషల్.. ‘RAPO23’ ప్రీ-లుక్ వైరల్!
‘పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలి’
KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
TVK Workers Open Channel Gates | రీల్ కోసం కాలువ గేట్లు తెరిచిన టీవీకే కార్యకర్తలు.. మండిపడిన ప్రతిపక్షాలు
Samantha Ruth Prabhu | ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’.. వైరలవుతున్న సమంత సంప్రదాయ వేడుక
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

