దుబాయ్: ఇరాన్‌తో జరుగుతున్న వార్‌లో అమెరికా తన ఆయుధ సంపదను భారీగా పోగొట్టుకుంటున్నది. మిస్సైల్ ఇంటర్సెప్టార్లను విరివిగా వాడేస్తున్నది. పశ్చిమాసియాలో ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా తన క్షిపణి రక్షణ వ్యవస్థను వినియోగిస్తున్నది. అయితే విభిన్న వ్యూహాలతో ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో.. అమెరికా తన ఆయుధాలను అధికంగా వాడాల్సి వస్తున్నది. గత వారం జోర్డాన్‌లోని అమెరికా వైమానిక దళంపై ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఆ దాడిని తిప్పికొట్టేందుకు అమెరికా సుమారు 70 హై ఎండ్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టార్లను వాడినట్లు తెలుస్తోంది.
కేవలం 20 ఇరానీ బాలిస్టిక్ క్షిపణులను కూల్చేందుకు సుమారు 60 నుంచి 70 వరకు పేట్రియాట్ ఇంటర్ సెప్టార్లను వాడినట్లు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు డజన్ సంఖ్యలో థాడ్ ఇంటర్సెప్టార్లను కూడా వాడినట్లు తెలుస్తోంది. ఇరానీ దళాలు జోర్డాన్‌లో ఉన్న మువాఫక్ సాల్తీ ఎయిర్ బేస్‌పై అటాక్ చేసిన విసయం తెలిసిందే. ఆ సమయంలో సుమారు 20 క్షిపణులను ఇరాన్ వదిలింది. దాంట్లో 18 క్షిపణులను అమెరికా దళాలు కూల్చివేశాయి. అమెరికా, జోర్డాన్ సంయుక్తంగా దాడిని తిప్పికొ్టినా, కొన్ని ఇరానీ క్షిపణులు బేస్‌ను ఢీకొట్టి అక్కడ ఉన్న విమానాలను ధ్వంసం చేశాయి. కానీ ఆ దాడులు అమెరికాకు పెనుభారం అవుతున్నాయి.