అహ్మదాబాద్: హింసాత్మక ఘర్షణకు సంబంధించి 18 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణ జరిగిన ప్రాంతానికి వారిని తీసుకెళ్లారు. నేర దృశ్య పునఃసృష్టిలో భాగంగా ఆ నిందితులను చితక బాదారు. (Cops Thrash 18 Accused In Public) ఈ మేరకు బహిరంగంగా గుణపాఠం చెప్పారు. గుజరాత్లోని పటాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 15న చనస్మా నగరంలో దుండగులు భీభత్సం సృష్టించారు. ఆలయ విరాళాల వివాదం కారణంగా హింసకు పాల్పడ్డారు. ‘ఝిలియా ముఠా’కు చెందిన వ్యక్తులు పదునైన ఆయుధాలతో స్థానికులపై దాడి చేశారు. పోలీస్ పీసీఆర్ వ్యాన్ను కూడా వారు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో పోలీసులు అక్కడ నుంచి పారిపోయారు.
కాగా, ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. చనస్మా పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఐదుగురు గ్రామ రక్షక్ దళ్ సభ్యులతో సహా ఎనిమిది మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు.
మరోవైపు హింసకు పాల్పడిన 18 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేర దృశ్య పునఃసృష్టి కోసం గురువారం వారిని ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిందితులు భీభత్సం సృష్టించిన మాదిరిగా పోలీసులు బహిరంగంగా వారిని లాఠీలతో చితక్కొట్టారు. వీధి న్యాయం పేరుతో వారికి గుణపాఠం చెప్పారు.
అయితే ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, నిందితుల హింస, వారిపై పోలీసుల ప్రతాపానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
🚨Gujarat Police showed zero tolerance
On March 15, a 20-man mob attacked a farmhouse in Patan over temple funds dispute & forced cops to retreat.
Next day, reinforced teams arrested 17-18 accused, paraded them publicly & delivered justice.
pic.twitter.com/HsMReO0o8H— Ramesh Tiwari (@rameshofficial0) March 19, 2026
Also Read:
Veterinarian Dies in Hippo Attack | ఆరోగ్య పరీక్షల సమయంలో నీటి గుర్రం దాడి.. పశువైద్యురాలు మృతి