Runaway Couple Reaches Supreme Court | పెళ్లి కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన జంట.. తర్వాత ఏం జరిగిందంటే?
Runaway Couple Reaches Supreme Court | ఒక ప్రేమ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. పెళ్లి కోసం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమను చంపుతామని తన కుటుంబ సభ్యులు బెదిరించినట్లు యువతి ఆరోపించింది. తమకు రక్షణ కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆ జంట కోరింది.
న్యూఢిల్లీ: ఒక ప్రేమ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. పెళ్లి కోసం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమను చంపుతామని తన కుటుంబ సభ్యులు బెదిరించినట్లు యువతి ఆరోపించింది. తమకు రక్షణ కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆ జంట కోరింది. (Runaway Couple Reaches Supreme Court) బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువతి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. వారిద్దరూ కలిసి ఢిల్లీకి పారిపోయారు. పెళ్లి కోసం ఏకంగా సుప్రీంకోర్టును ఆ జంట ఆశ్రయించింది.
కాగా, శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులోని పార్కింగ్ ఏరియాలో న్యాయవాది హర్విందర్ చౌదరిని ఆ జంట కలిసింది. ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తన తండ్రి, సోదరుడు తమను ఉరి తీస్తామని బెదిరించినట్లు యువతి ఆరోపించింది. సహాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా తమను అదుపులోకి తీసుకున్నారని ఆ యువతీ, యువకుడు వాపోయారు. కొన్ని జంటలు కోర్టులో పెళ్లి చేసుకోవడాన్ని సోషల్ మీడియా రీల్స్ ద్వారా తెలుసుకుని ఇక్కడకు వచ్చినట్లు ఆయనకు చెప్పారు. దీంతో న్యాయవాది హర్విందర్ చౌదరి ఆ జంట తరుఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యువతి కుటుంబం బెదిరింపుల నేపథ్యంలో ఆ జంటకు మూడు రోజులు రక్షణ కల్పించాలని కోరారు.
మరోవైపు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. తక్షణ ఉపశమనం కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఆ జంటకు సూచించింది. ‘హైకోర్టు దీనిని తప్పకుండా పరిశీలిస్తుంది. పంజాబ్, హర్యానా హైకోర్టులో నేను ఉన్నప్పుడు ఇలాంటి కేసులు చాలా చూశాను. ఒకవేళ హైకోర్టు దీనిని పరిగణనలోకి తీసుకోకపోతే, అప్పుడు మీరు మా వద్దకు రావచ్చు’ అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. ‘ఢిల్లీ హైకోర్టు దీనిని ఈ రోజే పరిగణనలోకి తీసుకుంటుందని నాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా హైకోర్టు రిజిస్ట్రార్‌కు తెలియజేస్తాం’ అని ఆ జంటకు భరోసా ఇచ్చారు.
Also Read:
Veterinarian Dies in Hippo Attack | ఆరోగ్య పరీక్షల సమయంలో నీటి గుర్రం దాడి.. పశువైద్యురాలు మృతి
Woman dies after tooth extraction | పన్ను పీకిన తర్వాత మహిళ మృతి.. డెంటల్ డాక్టర్ పరార్
Watch: శవాల మాదిరిగా నీటిలో తేలిన జంట.. వింత ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

