ఆ ప్రశ్నలకు సమాధానమే ‘అమీర్‌లోగ్’
‘అమీర్ లోగ్' అంటే శ్రీమంతుడు, సంపన్నుడు, అదృష్టవంతుడు.. ఇలా చాలా అర్థాలొస్తాయి. ఈ టైటిల్ అనుకున్నప్పుడు అసలైన ‘అమీర్ లోగ్' ఎవరు? అనే ప్రశ్న మస్తిష్కంలో మెదిలింది. డబ్బు ఉన్నవాడా? తన సమయం తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగిన వాడా? వ్యర్థాలోచనలు లేకుండా బిందాస్‌గా బతకగలిగిన వాడా?
‘అమీర్ లోగ్’ అంటే శ్రీమంతుడు, సంపన్నుడు, అదృష్టవంతుడు.. ఇలా చాలా అర్థాలొస్తాయి. ఈ టైటిల్ అనుకున్నప్పుడు అసలైన ‘అమీర్ లోగ్’ ఎవరు? అనే ప్రశ్న మస్తిష్కంలో మెదిలింది. డబ్బు ఉన్నవాడా? తన సమయం తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగిన వాడా? వ్యర్థాలోచనలు లేకుండా బిందాస్‌గా బతకగలిగిన వాడా? ఈ ప్రశ్నలను నాకు నేను సంధించుకుంటూ ఓ బస్తీలో ముగ్గురు కుర్రాళ్ల కథగా ఈ ‘అమీర్ లోగ్’ కథ రాశాను’ అని దర్శకుడు రమణారెడ్డి సోమ అన్నారు. ఆయన దర్శకత్వంలో మాధవిరెడ్డి సోమ నిర్మించిన హైదరాబాద్ నేపథ్య యువతరం సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ ప్రధాన పాత్రధారులు. ఈ నెల 21న విడుదల కానున్నది.
సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు రమణారెడ్డి సోమ విలేకరులతో మాట్లాడారు. ‘మాది నల్గొండ జిల్లా రాఘవపురం. 29ఏండ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చాను. జేఎన్టీయూలో ఆర్టిటెక్ట్ చదివాను. సినిమాలంటే ఇష్టం. కథలు రాయడం, చదవడం హాబీ. నా సొంత అనుభవాలతో కథలు రాసేవాడ్ని. రెండేళ్ల క్రితమే ‘అమీర్ లోగ్’ స్క్రిప్ట్ పూర్తయింది. హైదరాబాద్ బస్తీని అద్భుతంగా తెరపై చూపించాలని గట్టిగా అనుకున్నా. బస్తీలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించా. నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తే సంభాషణల్లో సహజత్వం పోతుందని సింక్ సౌండ్‌లో సినిమా తీశాను. 43 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు రమణారెడ్డి సోమ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

