Ponguleti | 22ఏ భూముల విషయంలో మంత్రి పొంగులేటి క్షమాపణలు.. అధికారుల తప్పిదం వల్లే అంటూ వ్యాఖ్య
Ponguleti : సెక్షన్ 22ఏ భూముల విషయంలో చెలరేగిన వివాదంపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై వివరణ ఇచ్చారు.
Ponguleti : సెక్షన్ 22ఏ భూముల విషయంలో చెలరేగిన వివాదంపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అధికారుల వల్లే తప్పు జరిగిందని, వారి తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఈ వివాదానికి అధికారులే కారణమంటూ తప్పిదాన్ని వారిపై తోసే ప్రయత్నం చేశారు.
ప్రైవేటు భూముల్ని నిషేధిత సెక్షన్ 22ఏ కింద చేర్చారంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి దీనిపై 750 దరఖాస్తులు వచ్చాయన్నారు. తమ భూముల్ని అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెప్పారు. దీంతో ఈ అంశంపై నాలుగు జిల్లాల అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ‘‘సెక్షన్ 22ఏ భూములపై మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో చర్చలు జరిపాం. ప్రస్తుతం ఈ జాబితాలో చేర్చిన భూములు గతంలో యూఎల్సీ జాబితాలో ఉండేవి. అయితే, నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేసే క్రమంలో పొరపాటు జరిగింది. ఇది అధికారుల నుంచి జరిగిన పొరపాటు. వారి తరఫున మేం క్షమాపణలు కోరుతున్నాం.
ప్రైవేటు ఆస్తుల్ని వెంటనే 22ఏ జాబితా నుంచి తొలగిస్తాం. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు 1800 5994788 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు. ఫిర్యాదు అందిన మూడు రోజుల్లోగా స్పందిస్తాం. ఒకవేళ ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కాకపోతే దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వారికి అందజేస్తాం. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే.. వారికి తిరిగి రీఫండ్ చేస్తాం’’ అంటూ పొంగులేటి వివరణ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

