Woman dies after tooth extraction | పన్ను పీకిన తర్వాత మహిళ మృతి.. డెంటల్ డాక్టర్ పరార్
Woman dies after tooth extraction | ఒక డెంటల్ క్లీనిక్‌లో మహిళ పన్ను పీకించుకున్నది. ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మరణించింది. ఈ నేపథ్యంలో డెంటల్ డాక్టర్ పరారయ్యాడు. ఆ మహిళ కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాంచీ: ఒక డెంటల్ క్లీనిక్‌లో మహిళ పన్ను పీకించుకున్నది. ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మరణించింది. ఈ నేపథ్యంలో డెంటల్ డాక్టర్ పరారయ్యాడు. ఆ మహిళ కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Woman dies after tooth extraction) జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హరిహర్గంజ్లోని ఒక ప్రైవేట్ డెంటల్ క్లినిక్‌లో బీహార్‌కు చెందిన విజయంతి దేవి పంటికి చికిత్స పొందింది. డెంటల్ క్లీనిక్ నిర్వహించే డాక్టర్ అష్రఫ్ అలీ ఆమె పన్ను పీకే సర్జరీ చేశాడు.
కాగా, పన్ను పీకిన తర్వాత విజయంతి దేవి తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ చికిత్స పొందుతూ మరణించింది. ఇది తెలుసుకున్న డెంటల్ డాక్టర్ అష్రఫ్ అలీ పారిపోయాడు.
మరోవైపు విజయంతి దేవి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెంటల్ డాక్టర్ నిర్లక్ష్యం కారణమని ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన డెంటల్ క్లీనిక్ నిర్వాహకుడి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. స్థానిక అధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. ఆ ప్రైవేట్ డెంటల్ క్లీనిక్‌కు సీల్ వేశారు.
Also Read:
Russian oil tanker | చైనా వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్.. దారి మళ్లి భారత్‌కు ప్రయాణం
Indore Fire Blast | ఈవీ కారుకు మంటలు, పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఏడుగురు సజీవ దహనం
Watch: బైక్ రేస్‌లో.. స్కూటీని ఢీకొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్, విద్యార్థి మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dental clinic
- Dies
- Jharkhand
- on run
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

