లక్నో: యువకుల బైక్ రేసింగ్ విషాదాన్ని మిగిల్చింది. రేసింగ్‌లో పాల్గొన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఆ బైక్ నడిపిన విద్యార్థి మరణించాడు. (Student Dies in Bike Race) ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం కొంత మంది యువకులు బైక్ రేసింగ్‌లో పాల్గొన్నారు.
కాగా, 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల నైతిక్ కుమార్, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650పై బైక్ రేసింగ్ చేశాడు. లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్దకు బైక్ రేసర్లు చేరుకున్నారు. పార్క్ గేట్ నంబర్ 5 వద్ద రోడ్డుపై ఏదో తప్పించేందుకు నైతిక్ కుమార్ ప్రయత్నించాడు. దీంతో బైక్‌పై నియంత్రణ కోల్పోయాడు. ఎదురుగా వస్తున్న హోండా యాక్టివాను ఢీకొట్టాడు. ఆ తర్వాత డివైడర్‌పై పటడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
మరోవైపు యాక్టివా స్కూటీ రోడ్డుపై జారిపడింది. బైక్ రేసింగ్ చేస్తున్న మరో యువకుడి కవాసకి నింజాను అది ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ రేసర్తోపాటు స్కూటీ నడిపిన వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖలో ఇంజినీర్ కుమారుడైన తీవ్రంగా గాయపడిన నైతిక్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అయితే ఆ విద్యార్థి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయడానికి అతడి కుటుంబం నిరాకరించింది. అంత్యక్రియల కోసం బారాబంకిలోని వారి గ్రామానికి నైతిక్ కుమార్ మృతదేహాన్ని తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, కవాసకి నింజా బైకర్ హెల్మెట్‌కు ఉన్న 360 డిగ్రీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాదం వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
📍Lucknow, Uttar Pradesh: Class 12 student Naitik lost his life while allegedly bike racing. His Bullet motorcycle collided with a scooter and then rammed into a divider, leading to the fatal crash.pic.twitter.com/QUOtMg7nLp
— Deadly Kalesh (@Deadlykalesh) March 16, 2026
Also Read:
Bihar Congress MLAs Missing | రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్
BJP’s Op Lotus | కర్ణాటకలో ‘ఆపరేషన్ లోటస్’.. ఒడిశా ఎమ్మెల్యేలకు డబ్బు ఎర, ఇద్దరు అరెస్ట్
drunk man urinates on woman | ఆటోలో వెళ్తూ మహిళపై మూత్ర విసర్జన చేసిన తాగుబోతు.. కొట్టి చంపిన జనం