drunk man urinates on woman | ఆటోలో వెళ్తూ మహిళపై మూత్ర విసర్జన చేసిన తాగుబోతు.. కొట్టి చంపిన జనం
drunk man urinates on woman | మద్యం సేవించిన వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆటో నుంచి రోడ్డుపై నడుస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో జనం అతడ్ని కొట్టి చంపారు.
చెన్నై: మద్యం సేవించిన వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆటో నుంచి రోడ్డుపై నడుస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో జనం అతడ్ని కొట్టి చంపారు. (drunk man urinates on woman) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. మార్చి 11న 30 ఏళ్ల కలైసెల్వన్ తన స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణించాడు. మద్యం తాగిన మత్తులో ఉన్న అతడు ఆటో నుంచి బయటకు మూత్ర విసర్జన చేశాడు.
కాగా, రోడ్డు పక్కన నడుస్తున్న మహిళపై మూత్రం పడింది. దీంతో కలైసెల్వన్, ఆ మహిళ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో జనం అక్కడ గుమిగూడారు. కొందరు వ్యక్తులు కలైసెల్వన్‌ను దారుణంగా కొట్టారు. ఈ నేపథ్యంలో అతడు కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కలైసెల్వన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలైసెల్వన్పై దాడి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆ ఆధారాల మేరకు సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read:
BJP’s Op Lotus | కర్ణాటకలో ‘ఆపరేషన్ లోటస్’.. ఒడిశా ఎమ్మెల్యేలకు డబ్బు ఎర, ఇద్దరు అరెస్ట్
Hostel Woman Harassed | హాస్టల్లో కేరళ మహిళకు వేధింపులు.. ఒక వ్యక్తి అరెస్ట్
Family Kills Daughter, Her Lover | ప్రేమించుకోవడంపై అభ్యంతరం.. జంటను హత్య చేసిన యువతి కుటుంబం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

