జూలై 30, హైదరాబాద్: సమాజం, పోలీసుల సమిష్టి కృషితోనే మానవ అక్రమ రవాణాను అడ్డుకోగలమని ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డా. సునీతా కృష్ణన్ (Sunitha Krishnan) అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బి.వి.ఆర్.ఆర్. తెలంగాణ పోలీస్ అకాడమీలో గురువారం “మానవ అక్రమ రవాణా సురక్షిత వలస (Human Trafficking & Safe Migration)” అనే అంశంపై పద్మశ్రీ డా. సునీతా కృష్ణన్ మాట్లాడారు. ఈ అవగాహన సదస్సులో ప్రసంగించిన ఆమె మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న సంఘటిత నేరమని పేర్కొన్నారు.
మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోందని ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక దోపిడి, బాల కార్మికత్వం, బలవంతపు భిక్షాటనం, అవయవాల అక్రమ రవాణా, సైబర్ మోసాలు, నకిలీ విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగే అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సునీతా కృష్ణన్ సూచించారు. సోషల్ మీడియా ద్వారా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ఆన్లైన్ గ్రూమింగ్, CSAM వంటి సైబర్ ముప్పులను వివరించి, బాధితుల రక్షణ, పునరావాసం, సమర్థవంతమైన దర్యాప్తు కోసం Prevention, Protection, Prosecution, Partnership (4Ps) సూత్రాలను సమిష్టిగా అమలు చేయాలని సునీత పిలుపునిచ్చారు.
On the occasion of World Day Against Trafficking in Persons, the Telangana Police Academy was privileged to host Padma Shri Dr. Sunitha Krishnan for a powerful and thought-provoking session on combating human trafficking.
Drawing on decades of frontline experience, Dr. Krishnan… pic.twitter.com/C7f5YDjLpB
— Telangana Police Academy – RBVRR TGPA (@TGPoliceAcademy) July 30, 2026
అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఐపీఎస్ మాట్లాడుతూ.. పోలీసు యూనిఫామ్‌పై ప్రజలకు అపార విశ్వాసం ఉందని, ప్రతి పోలీసు అధికారి ఆ విశ్వాసాన్ని నిజాయితీ, వృత్తి నైపుణ్యం, మానవీయ దృక్పథంతో నిలబెట్టాలని అన్నారు. మానవ అక్రమ రవాణాను ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తూ, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించడం, సమన్వయంతో పనిచేయడం, సోషల్ మీడియా వినియోగంలో బాధ్యతతో పాటు వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం అత్యంత అవసరమని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సునీతా కృష్ణన్‌ను అకాడమీ డైరెక్టర్ జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ జీ కవిత, అసిస్టెంట్ డైరెక్టర్ వేమా శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు, ప్రొబేషనరీ డీఎస్పీలు, ట్రైనీ అధికారులు పాల్గొన్నారు.