ICC : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది పురుషుల వన్డే ప్రపంచకప్(Mens ODI World Cup) వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీని మొత్తంగా 12 నగరాల్లో నిర్వహించనుంది ఐసీసీ. అయితే.. సింహభాగం మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోనే జరుగనున్నాయని ఐసీసీ గురువారం వెల్లడించింది. జింబాబ్వేలోని మూడు, నమీబియాలో ఒకేఒక నగరంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిస్తామని అత్యున్నత బోర్డు పేర్కొంది.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ వేదికలు ఖరారయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ మొత్తంగా 12 నగరాల్లో జరుగనుంది. ఆధునిక స్టేడియాల, మౌలిక వసతులు, ప్రేక్షకుల ఆదరణ.. ఈ మూడు విషయాలను దృష్టిలో పెట్టుకొని దక్షిణాఫ్రికాలోనే 8 సిటీలను ఎంపిక చేసింది ఐసీసీ. జింబాబ్వేలోని మూడు, నమీబియాలోని విండ్‌హోక్ నగరంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి.
JUST IN: ICC announce the host cities for next year’s men’s ODI World Cup in South Africa, Zimbabwe and Namibia 🏟️
🇿🇦 Johannesburg
🇿🇦 Centurion
🇿🇦 Cape Town
🇿🇦 Durban
🇿🇦 Gqeberha
🇿🇦 Bloemfontein
🇿🇦 Paarl
🇿🇦 Kugompo City
🇿🇼 Harare
🇿🇼 Bulawayo
🇿🇼 Victoria Falls
🇳🇦 Windhoek pic.twitter.com/1LhC4SX84r— Cricinfo (@cricinfo) July 30, 2026
2027 అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 21 వరకూ వరల్డ్‌కప్ జరుగనుంది. మెగా టోర్నీకి 14 జట్లు అర్హత సాధించగా.. 54 మ్యాచ్‌ల అనంతరం విజేత ఎవరో తేలిపోనుంది.
దక్షిణాఫ్రికా – జొహన్నెస్‌బర్గ్, సెంచూరియన్, కేప్‌టౌన్, డర్బన్, కెబెర్హ, బ్లొఎమ్ఫొంటెన్, పార్ల్, కుగుపో సిటీ.
జింబాబ్వే – హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్
నమీబియా – విండ్‌హోక్