NHRC | పొంగులేటి ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’పై అక్రమ మైనింగ్ ఆరోపణలు.. 8 వారాల్లోగా చర్యలకు ఆదేశం..!
NHRC : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ సంస్థపై అక్రమ మైనింగ్ ఆరోపణలపై జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది.
NHRC : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ సంస్థపై అక్రమ మైనింగ్ ఆరోపణలపై జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. మనాస హిల్స్ అక్రమ మైనింగ్ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
రాజేంద్రనగర్ మనాస హిల్స్ తవ్వకాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంది. తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదుకు కేంద్రం స్పందించాల్సిందే! “8 వారాల్లో నివేదిక ఇవ్వండి” అని మనాస హిల్స్ మైనింగ్ ఆరోపణలపై కేంద్రానికి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఫిర్యాదుదారునికి పురోగతి తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా.. మంత్రి అనుచరులకు వేరే చట్టమా? సాధారణ ప్రజలకు వేరే చట్టమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ మనాస హిల్స్ తవ్వకాల ఆరోపణలపై విచారణకు మార్గం సుగమం చేసింది.
అనుమతులు లేకుండానే భారీ తవ్వకాలా?
జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాలతో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఫిర్యాదును కేంద్ర గనుల శాఖ పరిశీలించనుంది. పర్యావరణ, గనుల, హెచ్ఎండీఏ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేకుండానే తవ్వకాలా? అంటూ ఎన్హెచ్ఆర్సీ ప్రశ్నించడంతో రాఘవపై దృష్టి సారించనుంది. అక్రమ మైనింగ్ ఆరోపణలపై డీజీఎంఎస్ చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది.
తద్వారా ఎంఎండీఆర్ చట్టం కింద చర్యల డిమాండ్‌కు ఎన్హెచ్ఆర్సీ ఊతమిచ్చింది. రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ మౌనం వహించడంపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలిచ్చింది. దీంతో మనాస హిల్స్ వివాదం జాతీయ స్థాయికి చేరింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

