ICET Helpline : శాతావాహన యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాల, గోదావరిఖనిలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ హెల్ప్ లైన్ (ICET Helpline) సెంటర్ ఏర్పాటు చేశారు. ఐసెట్ పరీక్ష ఫలితాలు వచ్చినందున ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇనుగాల మనోహర్ తెలిపారు.
జూలై 31, శనివారం నుండి ఐసెట్ హెల్ప్‌లైన్ సెంటర్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని ప్రిన్సిపల్ ఇనుగాల మనోహర్ తెలిపారు. ఈ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా ఆగస్టు 3వ నుండి 5వ తేదీ వరకు నిర్వహించే ఐసెట్ మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని ప్రిన్సిపల్ వెల్లడించారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు.
ఈ అవకాశాన్ని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. పీజీ కళాశాలలో ఇదివరకు ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా ఈ సంవత్సరం నుండి టీజీఐసెట్ కౌన్సిలింగ్ కూడా అందుబాటులోకి రానున్నది.