Indore Fire Blast | ఈవీ కారుకు మంటలు, పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఏడుగురు సజీవ దహనం
Indore Fire Blast | ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈవీ కారుకు మంటలు రాజుకున్నాయి. ఆ వాహనం నుంచి బిల్డింగ్‌కు మంటలు వ్యాపించాయి. ఒక ఇంట్లో ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ నేపథ్యంలో మంటల్లో కాలిపోయి ఏడుగురు సజీవ దహనమయ్యారు.
భోపాల్: ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈవీ కారుకు మంటలు రాజుకున్నాయి. ఆ వాహనం నుంచి బిల్డింగ్‌కు మంటలు వ్యాపించాయి. ఒక ఇంట్లో ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ నేపథ్యంలో మంటల్లో కాలిపోయి ఏడుగురు సజీవ దహనమయ్యారు. (Indore Fire Blast) మరో ముగ్గురికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇండోర్‌లోని బెంగాలీ స్క్వేర్ సమీపంలోని ఒక బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పుగాలియా కుటుంబానికి చెందిన బిల్డింగ్ సెల్లార్లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ కారులో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే మూడు అంతస్తుల నివాస భవనమంతా మంటలు వ్యాపించాయి.
కాగా, ఆ బిల్డింగ్‌లోని ఒక ఇంట్లో 12కు పైగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచారు. మంటలు వాటికి వ్యాపించాయి. సుమారు నాలుగు గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలాయి. గ్యాస్ సిలిండర్ల పేలుడు ధాటికి ఆ ప్రాంతం స్వల్పంగా కంపించింది.పేలుళ్ల తీవ్రత వల్ల భవనంలో కొంత భాగం కూలిపోయింది. గ్యాస్ సిలిండర్ల పేలుళ్ల శబ్దానికి స్థానికులు భయాందోళన చెందారు.
మరోవైపు మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ డోర్ లాక్ అయ్యింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు క్లిష్టమయ్యాయి. ఆ ఇంట్లో నివసించేవారు లోపల చిక్కుకుపోయారు. మంటల్లో కాలి ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ముగ్గురిని స్థానికులు కాపాడారు. కాలిన గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ ఇంటికి వచ్చిన బంధువులు రాత్రివేళ అక్కడ బస చేసిన సమయంలో ఈ విషాదం జరిగింది. ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమైనట్లు ఇండోర్ కలెక్టర్, ఎస్పీ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
🚨 Shocking news comming from Indore!
An electric car caught fire during charging due to a short circuit. Nearby gas cylinders turned it into a deadly explosion chain. 7 people lost their lives.💔#Indore 💔 pic.twitter.com/IZfX6AM6lz— Aarnav Sharma✨️ (@sunilaarnav) March 18, 2026
Breaking
Tragedy in Indore, Madhya Pradesh
A short circuit during electric car charging sparked a fire.
7 people lost their lives as nearby cylinders exploded.
Is safety just an afterthought in the rush for electric vehicles?@Abhimanyu1305 pic.twitter.com/YbBoudELEW— @Moini (@moini_565) March 18, 2026
Also Read:
minors rape girl | 8 ఏళ్ల బాలికపై.. ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

