RJD MLA Faisal Rahman | రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయని ఆర్జేడీ ఎమ్మెల్యే.. తన తల్లికి అనారోగ్యమని వెల్లడి
RJD MLA Faisal Rahman | బీహార్ రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్‌కు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యే ఫైసల్ రెహమాన్ గైర్హారయ్యారు. తన తల్లికి అనారోగ్యం కారణంగా ఓటు వేయలేకపోయినట్లు తెలిపారు. ఎవరికైనా తల్లి కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు.
పాట్నా: బీహార్ రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్‌కు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యే ఫైసల్ రెహమాన్ గైర్హారయ్యారు. (RJD MLA Faisal Rahman) తన తల్లికి అనారోగ్యం కారణంగా ఓటు వేయలేకపోయినట్లు తెలిపారు. ఎవరికైనా తల్లి కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. బీహార్‌లో సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆర్జేడీ ఎమ్మెల్యే ఫైసల్ రెహమాన్‌తో పాటు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటుకు దూరంగా ఉన్నారు.
కాగా, తన తల్లి అనారోగ్యం కారణంగా ఢిల్లీలో ఉన్నట్లు ఆర్జేడీ ఎమ్మెల్యే ఫైసల్ రెహమాన్ తెలిపారు. ఓటింగ్‌లో పాల్గొనడానికి తాను ఢిల్లీ నుంచి పాట్నాకు బయలుదేరినట్లు చెప్పారు. అయితే తన తల్లి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలియడంతో ఢిల్లీకి తిరిగి వెళ్లినట్లు వివరించారు. తన పరిస్థితి పార్టీ నాయకత్వానికి తెలుసని చెప్పారు. ‘ఎవరికైనా తల్లి కంటే ముఖ్యమైనది ఏదీ లేదు’ అని అన్నారు.
మరోవైపు బీహార్ రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మహాకూటమికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు. రెహమాన్ కాకుండా, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన మనోహర్ ప్రసాద్, సురేంద్ర కుష్వాహా, మనోజ్ విశ్వాస్ కూడా ఓటింగ్‌కు హాజరు కాలేదు. దీంతో మహాకూటమికి చెందిన ఆర్జేడీ అభ్యర్థి ఏడీ సింగ్‌కు 41 గాను 37 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
అయితే ఎన్డీయేకు చెందిన మొత్తం 202 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్, బీజేపీ నేతలు నితిన్ నబిన్, ఉపేంద్ర కుష్వాహ విజయం దాదాపు ఖాయమని తెలుస్తున్నది. ఐదో అభ్యర్థి శివేష్ కుమార్‌కు సుమారు 38 ఓట్లు పోలు కావడంతో ఆయన ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తున్నది.
Also Read:
Bihar Congress MLAs Missing | రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్
Mamata Banerjee | గ్యాస్ కొరతపై మమతా బెనర్జీ నిరసన.. కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్
minors rape girl | 8 ఏళ్ల బాలికపై.. ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

