Tricycle Given By Minister Breaks Down | వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర మంత్రి.. వంగిపోయిన చక్రం
Tricycle Given By Minister Breaks Down | వృద్ధుడైన వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్‌ను కేంద్ర మంత్రి పంపిణీ చేశారు. అది తొక్కిన కొద్ది సేపటికే ఒక చక్రం వంగిపోయింది. దీంతో ట్రై సైకిల్ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మరొకటి అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
భోపాల్: వృద్ధుడైన వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్‌ను కేంద్ర మంత్రి పంపిణీ చేశారు. అది తొక్కిన కొద్ది సేపటికే ఒక చక్రం వంగిపోయింది. దీంతో ట్రై సైకిల్ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మరొకటి అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. (Tricycle Given By Minister Breaks Down) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నాలుగు రోజుల పాటు గుణాలో పర్యటించారు. పురాని చావానీకి చెందిన రామ్‌రతన్ ఓజా ఒక కార్యక్రమంలో ఆయనను కలిశాడు. వికలాంగుడైన ఆ వృద్ధుడు మూడు చక్రాల సైకిల్ ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరాడు.
కాగా, సామాజిక న్యాయ శాఖ వెంటనే ట్రై సైకిల్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆ వికలాంగుడికి జ్యోతిరాదిత్య సింధియా దానిని అందజేశారు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమైన రామ్‌రతన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు.
మరోవైపు ఆ కార్యక్రమం తర్వాత మూడు చక్రాల సైకిల్‌ను రామ్‌రతన్ ఓజా నడిపాడు. సర్క్యూట్ హౌస్ నుంచి బయలుదేరి హనుమాన్ క్రాసింగ్ వరకు కేవలం 500 మీటర్లు ప్రయాణించగా ఒక చక్రం వంగిపోయింది. దీంతో ట్రై సైకిల్ కదలక పోవడంతో రోడ్డు మధ్యలో అతడు ఉండిపోయాడు.
కాగా, రామ్‌రతన్ ఓజా నడిపినప్పుడు ట్రై సైకిల్‌ను బైక్ ఢీకొట్టడంతో చక్రం వంకర పోయి ఉంటుందని ఒక అధికారి అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ ప్రాంతంలోని వ్యక్తులు అలాంటిది జరుగలేదని చెప్పారు. నాణ్యత లేని ట్రై సైకిల్ పంపిణీ చేసినట్లు ఆరోపించారు.
దీంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆ ట్రై సైకిల్‌కు వారంటీ ఉన్నదని తెలిపారు. మరొక దానిని అందజేస్తామని చెప్పారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతామని వెల్లడించారు.
आज गुना में वरिष्ठ नागरिक एवं दिव्यांगजन हेतु भारत सरकार की राष्ट्रीय वयोश्री योजना, एडिप योजना एवं श्रीमंत माधवराव सिंधिया स्वास्थ्य सेवा मिशन योजनांतर्गत निःशुल्क सहायक उपकरण एवं कृत्रिम अंग वितरण कार्यक्रम में केंद्रीय मंत्री श्रीमंत महाराज साहब @JM_Scindia जी ने बैटरी चालित… pic.twitter.com/UrDPOcKK6b
— Ankur Shrivastava (@ankurshriguna) March 14, 2026
Also Read:
Bihar Congress MLAs Missing | రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్
minors rape girl | 8 ఏళ్ల బాలికపై.. ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారం
Watch: బైక్ రేస్‌లో.. స్కూటీని ఢీకొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్, విద్యార్థి మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

