Sanjay jaju | అత్యుత్తమ డిజిటల్ సేవల కోసం మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలి : సీఎస్ సంజయ్ జాజు
Sanjay jaju | టీ-ఫైబర్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Sanjay jaju | హైదరాబాద్, ఆగస్టు 03 : రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్ట పరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు.
ఈ సమావేశంలోడిజిటల్ ఇండియా – వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాల కల్పన, కృత్రిమ మేధస్సు (AI), సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI), యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు. రాష్ట్రంలో డిజిటల్ సామర్థ్యాల పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, ప్రజా సేవల నాణ్యత మెరుగుదల, డేటా గవర్నెన్స్ వంటి రంగాల్లో ప్రపంచ బ్యాంక్ అందించగల సాంకేతిక సహకారం, జ్ఞాన భాగస్వామ్యం, అంతర్జాతీయ ఉత్తమ విధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
టి-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక సమీక్ష..
దేశంలో డిజిటల్ రంగంలో పెట్టుబడులకు హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (DPRలు) సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. టి-ఫైబర్ (T-Fiber)పై సమీక్ష అనంతరం టి-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవల విస్తరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
టీ-ఫైబర్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దూరిశెట్టి, ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ, టి-ఫైబర్ ఎం.డి., సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
KTR | పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం : కేటీఆర్
Vinesh Phogat | వ్యవస్థ మొత్తం బ్రిజ్ భూషణ్‌నే కాపాడుతుంది: వినేశ్ ఫోగట్
Justice M.S. Liberhan: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్ హెడ్ జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ కన్నుమూత
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

