చండీఘడ్: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్‌కు హెడ్‌గా ఉన్న జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హన్(Justice M.S. Liberhan) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, ఆ ఘటన జరగడానికి కారణాలు, దానితో లింకున్న అంశాలను ఆయన దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 2వ తేదీ, ఆదివారం చండీఘడ్‌లో జస్టిస్ లిబర్హన్ తుది శ్వాస విడిచినట్లు పంజాబ్, హర్యానా హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహిత్ సూద్ తెలిపారు. లిబర్హన్ పార్దీవదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
1964లో లిబర్హన్ తన లీగల్ ప్రాక్టీస్‌ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ప్రారంభించారు. 1970లో ఆయన పంబాజ్ హైకోర్టు బార్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 1987 వరకు ఆ బార్ సభ్యుడిగా కొనసాగారు. 1976 నుంచి 1983 వరకు బార్ కౌన్సిల్ సెక్రటరీగా కూడా చేశారు. 1987 ఫిబ్రవరి 11వ తేదీన ఆయన పంజాబ్ హర్యానా కోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు. 1997 జూలై 7వ తేదీన ఆయన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1998 ఫిబ్రవరి 28వ తేదీన ఆంధప్రదేశ్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు.
1992 డిసెంబర్ 16వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లిబర్హన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు.