KTR | దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం.. ఆయనపై రేవంత్ సర్కార్ ఒత్తిడి చేసిన మాట వాస్తవమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వెదవలు ఆయన చేస్తున్న దాడిని, విమర్శలను తట్టుకోలేకపోయారని అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పెద్దిసుదర్శన్ రెడ్డి ఇదే భవన్ నుంచి ఇదే సీట్లో కూర్చొని సివిల్ సప్లై స్కాంను బయటపెట్టారు. ఇదే సీట్లో కూర్చొని విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టారు. మా సుదర్శన్ రెడ్డి అంతటితో ఆగకుండా ఆ కాగితాలు, ఆధారాలు తీసుకెళ్లి ఈడీ ఆఫీస్కు వెళ్లి అక్కడ ఇచ్చారు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయాడు. బాధాకరమెక్కడంటే సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరునాడు మాకు సుప్రీంకోర్టు నుంచి కొంత రిలీఫ్ వచ్చింది.. గైడెన్స్ కూడా వచ్చింది. వీరికి నోటీస్ వచ్చింది. ఇది వాస్తవం ఈ రాష్ట్రంలో మా నాయకులెవరినీ కూడా వేధించకుండా, టార్చర్ చేయకుండా ఈ ప్రభుత్వం లేదు. దురదృష్టవశాత్తు సుదర్శన్ రెడ్డి విషయంలో అన్యాయం జరిగింది. మీరు చూశారు కదా.. అన్నారు.
బీసీ రిజర్వేషన్లు మోదీ ఆపారని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నడు.నువ్వు చేసిన తీర్మానం.. చిత్తు కాగితం. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా రేవంత్ వ్యాఖ్యలు.విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది సోనియా గాంధీ. మీరు తెచ్చిన చట్టాన్ని మీరే తుంగలో తొక్కుతారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.గురుకులాల్లో 150 మంది విద్యార్థులను చంపడం కాంగ్రెస్ సక్సెసా..? ఎండ్రిన్ తాగి చావండని తిట్టడం సక్సెసా..?కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో టెక్ ఉద్యోగాలు తగ్గిపోయాయి. 7 వేల ఐటీ ఉద్యోగాలు పోయాయి.ఎందుకు పోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.సీఎం రేవంత్, విద్యా శాఖ అట్టర్ ఫ్లాప్.అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు.
కాళేశ్వరంపై ఉత్తమ్ కుమార్కు అవగాహన ఉందా.. ?
జులై నెల అంతా గోదావరిలో నీళ్లు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.నీళ్లు ఎత్తకుండా రైతాంగాన్ని ఎండబెట్టిన వేస్ట్, క్రిమినల్ గవర్నమెంట్ ఇదని కేటీఆర్ ధ్వజమెత్తారు..నాలుగు టీఎంసీలు రాగానే.. హెలికాప్టర్ వేసుకొని వెళ్లి ఉత్తమ్ కుమార్ పోజులు కొట్టిండు.ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లెలా వస్తున్నాయి..? గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్ నుంచి కాదా..?కాళేశ్వరంపై ఉత్తమ్ కుమార్కు అవగాహన ఉందా.. ?
రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదని రైతులకు అర్థమైంది.మంచి వర్షాలు పడాలని ఉజ్జయిని మహంకాళికి మొక్కుకున్నా.రేవంత్ ప్రతీ స్కీం వెనక స్కాం ఉంటది. మెట్రోను ఎందుకు టేకోవర్ చేశాడు..? రూ.200 కోట్లు కొట్టేయడానికి రేవంత్, ఆయన సోదరుల స్కెచ్. బీఆర్ఎస్ పాలనలో మెట్రోను అడ్డుకున్నదే కాంగ్రెస్, బీజేపీ. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు ట్రాఫిక్ ఉండదని అబద్ధం చెప్పారు. బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం
నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను
విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు
కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి… https://t.co/1Dve4NLbjO pic.twitter.com/IpnzXgQ1TN
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026