Mandaadi | టాలీవుడ్ యాక్టర్ సుహాస్, తమిళ నటుడు సూరి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం మండాడి (Mandaadi). సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీని సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేశాడు. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మండాడి సూరి కెరీర్లో గ్లోబల్‌వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన తొలి సినిమాగా నిలిచింది. మండాడి తెలుగు వెర్షన్ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
సూరి సొంత రాష్ట్రం తమిళనాడులో బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లు వసూలుచేసిన ఈ మూవీ రూ.100 కోట్ల మైల్ స్టోన్ దిశగా ముందుకెళ్తోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలే ఈ మార్క్‌ను చేరుకుంటాయి. ఒకవేళ మూడంకెల డిజిట్‌ను దాటుకుందంటే సూరి కెరీర్లో ఇదొక హిస్టారికల్ అఛీవ్మెంట్గా నిలిచిపోనుంది. తీర ప్రాంతం, మత్య్సకారుల నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో సుహాస్ సాట్టపులి రోల్లో నటించాడు.
మహిమా నంబియార్ కీలక పాత్రలో నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా.. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ తెరకెక్కించింది. మరి రాబోయే రోజుల్లో మండాడి బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
🔥 BLOCKBUSTER MANDAADI CONTINUES SUCCESSFULLY! 🔥
Experience Mandaadi in 1.85:1 Flat
Version on the BIG screen! 🎬🔥EXPERIENCE IT IN MEGAMAX 💥#Mandaadi #MegaMax #MegastarCinemas #185Flat #FlatVersion #ExperienceItInMegaMax #Blockbuster #TamilCinema pic.twitter.com/O8rD1qytdU
— Megastar Cinemas PLF Pure RGBLaser 4K DolbyAtmos (@Megastartheatre) September 28, 2026
UPI Transactions: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. తాత్కాలిక స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
KTR | పట్టాలివ్వకపోతే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాళ్లతో కొట్టుమన్నడు.. రైతులతో కేటీఆర్
PYL Secretary | భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి : పీవైఎస్ కార్యదర్శి