KTR | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న బహదూర్‌పల్లి రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఏమన్నాడు.. మీకు పట్టాలివ్వకపోతే రాళ్లతో కొట్టుమన్నడు. రేవంత్ రెడ్డి ఏమో ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టుమన్నడు. రైతుల భూములకు పట్టాలు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టమని అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిని కొట్టాలే.. రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా.. ప్రకాశ్ గౌడ్‌ను కొట్టాల్నా అని కేటీఆర్ అడిగారు.
మీ ఇండ్ల మీదికి ఏదో పక్క దేశం మీద దండయాత్రకు పోయినట్టు 4వేల మంది పోలీసోళ్లను పంపిండు. నిజంగా నీతి, నిజాయితీ ఉంటే నీ దగ్గర, ప్రభుత్వం దగ్గర కాగితాలుంటాయి. 4 వేల మంది పోలీసులను పంపే అవసరం ఏముందని ప్రశ్నించారు. నిజంగా గవర్నమెంట్ దగ్గర కాగితాలుంటే భూమి వాళ్లదే అనే మాట వాజీబు అయితే అంతమంది పోలీసులను పంపుతావ్ అని ఫైర్ అయ్యారు.
బుల్లెట్ ట్రైన్ విషయంలో మనకేం ఎలాంటి వ్యతిరేకత లేదు.. బుల్లెట్ ట్రైన్ రావాల్సిందే.. వచ్చేటప్పుడు వస్తది.. కానీ ఆ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. మీకు పక్కాగానేను పార్టీ తరపున ఇచ్చే మాట సంవత్సరమున్న తర్వాత కేసీఆర్ వస్తారు. మీ అందరి దయతోని వస్తడు.. మీకు మీ పట్టాలు మీకిచ్చి మీ బహదూర్గూడలోనే మీటింగ్ పెట్టి ఇదే కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యేగా మీకు పట్టాలిస్తడు.. ఏ కార్తీక్ రెడ్డి అయితే ఇవాళ హైకోర్టుకు పోయి మీకు న్యాయం చేసిండో.. ఇదే కార్తీక్ రెడ్డి చేతుల మీదుగా మీకు పట్టాలిప్పించే బాధ్యత నాదన్నారు.
కేసీఆర్ సీఎం అవ్వగానే బహదూర్‌గూడలో మీటింగ్ పెట్టి కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యేగా మీకు పట్టాలు ఇస్తాడు
ఇది మీకు బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న మాట
బుల్లెట్ ట్రైన్ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఊరుకునేది లేదు
– కేటీఆర్ https://t.co/dRVy8Fhb2r pic.twitter.com/nKsLGOJCvy
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2026
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రైతుల భూములకు పట్టాలు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టమని అన్నాడు
రేవంత్ రెడ్డి ఏమో వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే రాళ్లతో కొట్టమని అన్నాడు
మరి ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలి.. రేవంత్ రెడ్డిని కొట్టాలా? ప్రకాశ్ గౌడ్‌ను కొట్టాలా?
రేవంత్ రెడ్డి బహదూర్… https://t.co/UP532UmaDj pic.twitter.com/JZ9uvX9VFN
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2026