న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలు(UPI Transactions) రూ.2 వేలు దాటితే, ఎండీఆర్ వసూల్ చేయనున్నట్లు కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రంతో పాటు ఆర్బీఐ, ఎన్పీసీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కమర్షియల్ యూఐపీ లావాదేవీలపై ఛార్జీలు వసూల్ చేయడాన్ని పిల్లో ప్రశ్నించారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఇవాళ రిట్ పిటీషన్‌ను స్వీకరించింది. అడ్వకేట్ అంజన్ దత్తా ఆ పిటీషన్ వేశారు.
సెప్టెంబర్ 14, 15 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన గెజిటెడ్ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే నాలుగు వారాల్లోగా ఎండీఆర్ పన్నుపై వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్టపరంగా ఇది చిన్న సమస్య అని, కానీ సాంకేతికంగా పెద్ద సమస్యగా ఉందని కోర్టు చెప్పింది. ఎండీఆర్ వసూల్ చేయాలనుకోవడం పన్నా లేక ఫీజా అని కోర్టు అడిగింది. ఒకవేళ ఫీజు కాకుంటే ఆదేశాలు ఎందుకని ప్రశ్నించింది.
వ్యాపారిపై ఎండీఆర్‌ను వసూల్ చేయాలనుకుంటున్న కేంద్రం ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. 2 వేల ట్రాన్స్ఫర్ దాటితే, అక్టోబర్ 15 నుంచి ఎండీఆర్ ఛార్జీలు వసూల్ చేయనున్నారు.