ఊట్కూర్ : స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ ( Bhagat Singh ) ఆశయాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యలపై ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా కార్యదర్శి సిద్ధు ( PYL Secretary Siddu ) పిలుపు నిచ్చారు. భగత్‌సింగ్ జయంతి సందర్భంగా సోమవారం ఊట్కూర్ మండలం బిజ్వార్లో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న యుద్ధ విధానాలకు వ్యతిరేకంగా యువత గళమెత్తాలని అన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పేద, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
దేశంలో పేదలందరికీ ఉచిత వైద్యం అందించడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో బిజ్వార్ ఉపసర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ గ్రామ పార్టీ నాయకులు పి.నరసింహ, పీవైఎల్ నాయకులు ఎల్లప్ప, పిరికి రాము, కొండప్పపాల్గొన్నారు.