Karnataka Cabinet Expansion | కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మాజీ సీఎం సిద్ధరామయ్య గైర్హాజరు
Karnataka Cabinet Expansion | కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. సోమవారం లోక్‌భవన్‌లో గవర్నర్ గెహ్లాట్ 20 మంతి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
బెంగళూరు: కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. సోమవారం లోక్‌భవన్‌లో గవర్నర్ గెహ్లాట్ 20 మంతి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. (Karnataka Cabinet Expansion) అయితే మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రముఖ కురుబ నాయకురాలు గాయత్రి శాంతే గౌడను చివరి నిమిషంలో మంత్రివర్గం నుంచి తొలగించడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు.
కాగా, మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. మంత్రి పదవులు దక్కకపోవడంపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామాలు, రహస్య సమావేశాలతో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగింది. ఈ తరుణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్ధరామయ్య గైర్హాజరు కావడం మరింత చర్చనీయాంశమైంది.
మరోవైపు కేబినెట్లో చోటు దక్కకపోవడంతో ఇండి ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ వి. పాటిల్ సోమవారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విధాన సౌధలో డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమానికి తన రాజీనామా లేఖను సమర్పించారు. పార్టీ నాయకత్వం తన పట్ల అన్యాయంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆయన మద్దతుదారులు నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు.
#WATCH | Karnataka cabinet expansion underway in Bengaluru
20 MLAs take oath as ministers in the Chief Minister DK Shivakumar led government
(Video Source: DIPR) pic.twitter.com/aWOS2PSBu6
— ANI (@ANI) August 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

