కోదాడ, ఆగస్టు 03 : కుమ్మరి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన చలిగంటి రామారావు సమాజ సేవలో భాగస్వాములు కావాలని జడ్పీహెచ్ఎస్ కోదాడ వాకర్స్ క్లబ్ సభ్యులు కోరారు. సోమవారం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి రామారావు అని కొనియాడారు. తన సామాజికవర్గంతో పాటు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేయాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు బద్దం భద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎస్.కె నయీమ్, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.