Sampath Nandi | కథ ప్రకారమే ఆ సన్నివేశాలు ఉంటాయి.. ‘భోగి’ సినిమాలో హింసపై దర్శకుడు సంపత్ నంది క్లారిటీ!
Bhogi Movie | శర్వానంద్ కథానాయకుడిగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'భోగి'. ఈ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
Sharwanand | శర్వానంద్ కథానాయకుడిగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భోగి’. ఈ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సంపత్ నంది స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు.
సినిమాలో హింసను కేవలం ప్రేక్షకులను ఆకర్షించడానికో లేదా బలవంతంగానో చొప్పించలేదని, కథానుసారంగానే ఆ సన్నివేశాలు సహజంగా వస్తాయని సంపత్ నంది స్పష్టం చేశారు. తమ చిత్రం రివైజింగ్ కమిటీకి వెళ్తుందని తాము అస్సలు ఊహించలేదని, అయితే సెన్సార్ బోర్డు సూచన మేరకు ఆ ప్రక్రియకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కారణంగానే ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిందని, ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ-రిలీజ్ వేడుకలతో పాటు ప్రమోషన్లకు కూడా తగిన సమయం దొరకలేదని అంగీకరించారు. అయినప్పటికీ, తమ సినిమా కంటెంట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ప్రస్తుతం అన్ని అడ్డంకులను అధిగమించి నవంబర్ 27న ‘భోగి’ థియేటర్లలోకి రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కథ పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని కూడా సంపత్ నంది పంచుకున్నారు. తన చిన్నతనంలో మూఢనమ్మకాలతో కూడిన పూజలు చేస్తూ, తమ ఊరి పరిసర గ్రామాల్లో సంచరించే ఒక వ్యక్తిని తాను చూశానని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన అలాంటిదే ఒక సంఘటన గురించి వార్తాపత్రికలో వచ్చిన కథనం తనను కదిలించిందని, దాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను సిద్ధం చేశానని చెప్పారు. అయితే ఆ సంఘటనను కేవలం స్ఫూర్తిగా మాత్రమే తీసుకున్నామని, మిగతా కథంతా ‘బొగ్గులగుట్ట’ అనే ఒక కల్పిత గ్రామం చుట్టూ అల్లుకున్న కల్పిత కథనమేనని స్పష్టం చేశారు.
1960వ దశకం నాటి నేపథ్యంలో, ఒక అన్న మరియు అతని ఐదుగురు చెల్లెళ్ల అనుబంధం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆ నాటి కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడానికి దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఆరు నుండి ఏడు నెలల పాటు శ్రమించి ఈ కల్పిత గ్రామాన్ని నిర్మించామని సంపత్ నంది తెలిపారు. అంతేకాకుండా ఆ కాలం నాటి దుస్తులు, వస్త్రాలు, ఆభరణాలు వంటి ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నామని పేర్కొన్నారు. 2021లో వచ్చిన ‘సీటీమార్’ తర్వాత సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త మాస్, గ్రామీణ పాత్రలో కనిపించనుండగా, ఆ పాత్ర కోసం ఆయన దాదాపు మూడు నెలల పాటు జుట్టు, గడ్డం పెంచి పూర్తిగా మేకోవర్ అయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sampath Nandi | కథ ప్రకారమే ఆ సన్నివేశాలు ఉంటాయి.. ‘భోగి’ సినిమాలో హింసపై దర్శకుడు సంపత్ నంది క్లారిటీ!
Professor Teja Sri | క్షీణించిన ప్రొఫెసర్ తేజ శ్రీ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు.. వీడియో
విమానంలో తోటి ప్రయాణికుడిపై వ్యక్తి పిడిగుద్దులు.. బెల్టుతో గొంతు నొక్కేందుకు యత్నం
Alias Rukmini | బాక్సాఫీస్ పోటీని తట్టుకునేందుకు నాని, నితిన్ వ్యూహం.. ‘అలియాస్ రుక్మిణి’ ప్రీమియర్స్ ప్లాన్!
Vitamin B12 | జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో కొత్త ఆశలు.. విటమిన్ బి12 చేస్తున్న అద్భుతాలు..
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

