Alias Rukmini | బాక్సాఫీస్ పోటీని తట్టుకునేందుకు నాని, నితిన్ వ్యూహం.. ‘అలియాస్ రుక్మిణి’ ప్రీమియర్స్ ప్లాన్!
Alias Rukmini | యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'అలియాస్ రుక్మిణి'.
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘అలియాస్ రుక్మిణి’. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్ సరసన అఫియా సయ్యద్ హీరోయిన్గా నటించగా, దీప్తి గంటా నిర్మించారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. చిత్రబృందం సినిమా విడుదలకు ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 3న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తోంది. సినిమా కంటెంట్‌పై ఉన్న అపారమైన నమ్మకంతోనే మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్‌కు ఈ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కీలకంగా మారింది. మరోవైపు ఇదే డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య నటించిన ‘వృషకర్మ’ చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో, మొదటి రోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రీమియర్ షోలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే నాని బ్రాండ్ వాల్యూ తోడవడంతో ఈ చిత్రానికి దాదాపు రూ. 25 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. కృష్ణ అనే యువకుడి సాధారణ జీవితంలోకి ఊహించని రహస్యంతో కూడిన ప్రేమ ప్రవేశించినప్పుడు ఏం జరిగిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సాయి కుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం, జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ప్రీమియర్ షోల ద్వారా ముందే హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | బాక్సాఫీస్ పోటీని తట్టుకునేందుకు నాని, నితిన్ వ్యూహం.. ‘అలియాస్ రుక్మిణి’ ప్రీమియర్స్ ప్లాన్!
Vitamin B12 | జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో కొత్త ఆశలు.. విటమిన్ బి12 చేస్తున్న అద్భుతాలు..
Free Bus | ఫ్రీ బస్సు నో యూస్.. పక్క రాష్ట్రాల బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులు
KTR | ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్.. అక్రమ అరెస్టులపై కేటీఆర్
MLC voters | నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

